సీనియర్‌ నటి నళిని(Nalini) ఎనిమిదో దశకంలో అగ్ర కథానాయిక. దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించారు. చిరంజీవితో(Chiranjeevi) ఇంటిగుట్టు, సంఘర్షణ వంటి సినిమాలలో నటించిన నళిని తెలుగులోనే కాదు తమిళంలోనూ, ఇతర భాషల్లోనూ హీరోయిన్‌గా నటించారు. హీరోయిన్‌గా పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే నటుడు, దర్శకుడు రామరాజన్‌ను(Ramarajan) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నళిని.

సీనియర్‌ నటి నళిని(Nalini) ఎనిమిదో దశకంలో అగ్ర కథానాయిక. దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించారు. చిరంజీవితో(Chiranjeevi) ఇంటిగుట్టు, సంఘర్షణ వంటి సినిమాలలో నటించిన నళిని తెలుగులోనే కాదు తమిళంలోనూ, ఇతర భాషల్లోనూ హీరోయిన్‌గా నటించారు. హీరోయిన్‌గా పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే నటుడు, దర్శకుడు రామరాజన్‌ను(Ramarajan) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నళిని. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, టీవీ సీరియల్స్‌లో అమ్మ పాత్రలు పోషిస్తున్న నళిని.. లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలు తెలిపారు. సరిగ్గా చెప్పాలంటే ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి చెప్పారు. హీరోయిన్‌గా తాను బిజీగా ఉన్నప్పుడు ఏడాదికి 24 సినిమాలు నటించిన సందర్భాలు ఉన్నాయన్నారు నళిని. తినడం, నిద్రపోవడం కోసమే పెళ్లి చేసుకోవాలని భావించానని, అప్పుడే నటుడు, దర్శకుడు రామరాజన్‌ను ప్రేమించానని తెలిపారు. 'కొన్నాళ్లకు మా ప్రేమ వ్యవహారం నా తల్లిదండ్రులకు చెప్పాను. అప్పటినుంచి రామరాజన్‌‌తో నటించడానికి వాళ్లు ఒప్పుకోలేదు. రామరాజన్‌ మంచి నటుడు, తెలియకుండా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నిజంగా ఆయన బంగారు లాంటి మనిషి. తర్వాత మా ఇద్దరికీ ఎందుకో కుదరలేదు. దీంతో పరస్పరం మాట్లాడుకుని విడిపోయాం. విడాకులు తీసుకున్నాం. పెళ్లి రద్దయినా ఇప్పటికీ ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నా. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు' అని నటి నళిని తన ఆవేదన బయటపెట్టింది.

Updated On 26 July 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story