మధుబాలకు ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు. తండ్రి అతాఉల్లా ఖాన్ బతుకుతెరువు కోసం ఢిల్లీ నుంచి బాంబేకు వచ్చారు. సంపాదన లేకపోవడంతో బేబీ ముంతాజ్‌ను ఎనిమిదవ ఏటనే సినిమాల్లో ప్రవేశపెట్టాడు. సినిమాల్లో చేర్పిస్తున్నప్పుడే బోల్డన్నీ కండిషన్లు పెట్టాడు. ఇంటి నుంచే భోజనం, నీళ్లు తీసుకెళ్లాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని, సాయంత్రం ఆరింటికల్లా షూటింగ్ ముగించేసుకుని ఇంటికి వచ్చేయాలని, ఇంటికి ఎవరూ రాకూడదని, సినిమా ఫంక్షన్లకు వెళ్లకూడదని, విలేకరులతో ముచ్చటించకూడదని, చివరాఖరిగా వచ్చిన డబ్బంతా తనకే ఇవ్వాలని .. ఇలాంటి నిబంధనలు పెట్టాడు. మధుబాల సంపాదించిన డబ్బుతో జల్సాలు చేశాడు. సినిమాల్లో తగలేశాడు. సయ్యద్, షాన్ ఏ అవధ్, మెహబూబా, లాలీ చందన్ వంటి సినిమాలెన్నింటినో తీశాడు అతాఉల్లాఖాన్. ఏ ఒక్కటి ఆడలేదు. కొన్ని నిర్మాణాలు సగంలోనే ఆగిపోయాయి. సయ్యద్ సినిమా కోసం మూడు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత కారణేమిటో తెలియదు కానీ ఆపేశాడు. షాన్ ఎ అవధ్‌ను కూడా అంతే. దీనికి కారణం మాత్రం దర్శకుడు ఆలస్యంగా వచ్చాడని! ఇదిగో ఇలా మధుబాల సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. అతాఉల్లా ఖాన్ పూర్తి చేసి విడుదల చేసిన సినిమాలు కూడా అట్టర్‌ఫ్లాప్ అయ్యాయి. 1955లో వచ్చిన నాతా ఘోరంగా దెబ్బతింది. ఫలితంగా మధుబాల భవంతిని తాకట్టు పెట్టాల్సి వచ్చింది.
మధుబాలకు ఇద్దరు అక్కలు, ముగ్గురు చెల్లెళ్లు. తండ్రి అతాఉల్లా ఖాన్ బతుకుతెరువు కోసం ఢిల్లీ నుంచి బాంబేకు వచ్చారు. సంపాదన లేకపోవడంతో బేబీ ముంతాజ్‌ను ఎనిమిదవ ఏటనే సినిమాల్లో ప్రవేశపెట్టాడు. సినిమాల్లో చేర్పిస్తున్నప్పుడే బోల్డన్నీ కండిషన్లు పెట్టాడు. ఇంటి నుంచే భోజనం, నీళ్లు తీసుకెళ్లాలని, ఎవరితోనూ మాట్లాడకూడదని, సాయంత్రం ఆరింటికల్లా షూటింగ్ ముగించేసుకుని ఇంటికి వచ్చేయాలని, ఇంటికి ఎవరూ రాకూడదని, సినిమా ఫంక్షన్లకు వెళ్లకూడదని, విలేకరులతో ముచ్చటించకూడదని, చివరాఖరిగా వచ్చిన డబ్బంతా తనకే ఇవ్వాలని .. ఇలాంటి నిబంధనలు పెట్టాడు. మధుబాల సంపాదించిన డబ్బుతో జల్సాలు చేశాడు. సినిమాల్లో తగలేశాడు. సయ్యద్, షాన్ ఏ అవధ్, మెహబూబా, లాలీ చందన్ వంటి సినిమాలెన్నింటినో తీశాడు అతాఉల్లాఖాన్. ఏ ఒక్కటి ఆడలేదు. కొన్ని నిర్మాణాలు సగంలోనే ఆగిపోయాయి. సయ్యద్ సినిమా కోసం మూడు లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత కారణేమిటో తెలియదు కానీ ఆపేశాడు. షాన్ ఎ అవధ్‌ను కూడా అంతే. దీనికి కారణం మాత్రం దర్శకుడు ఆలస్యంగా వచ్చాడని! ఇదిగో ఇలా మధుబాల సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. అతాఉల్లా ఖాన్ పూర్తి చేసి విడుదల చేసిన సినిమాలు కూడా అట్టర్‌ఫ్లాప్ అయ్యాయి. 1955లో వచ్చిన నాతా ఘోరంగా దెబ్బతింది. ఫలితంగా మధుబాల భవంతిని తాకట్టు పెట్టాల్సి వచ్చింది.
1960లో వచ్చిన మహలోం కా ఖ్వాబ్, 1962లో వచ్చిన పఠాన్ కూడా సేమ్ టు సేమ్. చాలా మంది హీరోయిన్లలాగే మధుబాల కూడా తండ్రి ధనవ్యామోహానికి బలయ్యారు. మధుబాలకు(Madhubala) పరిచయాలు పెరిగితే తనను వదిలేసి వెళ్లిపోతుందన్న భయం అతాఉల్లా ఖాన్‌ది! బాంబేలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు హాలీవుడ్ డైరెక్టర్ ఫ్రాంక్ కాప్రా వచ్చారు. అతడిని చూడటానికి అప్పటి తారమణులంతా వెళ్లారు. మధుబాల మాత్రం వెళ్లలేదు. అతాఉల్లా వెళ్లనివ్వలేదు. కానీ మూవీ టైమ్స్ పత్రిక కవర్ పేజీ మీద మధుబాల ఫోటో చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు కాప్రా. ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. పక్కనే ఉన్న బి.కె.కరంజియాతో ఈ అమ్మాయిని డిన్నర్‌కు పిలు, హాలీవుడ్‌కు పరిచయం చేస్తాను అని అన్నాడు. అయినా మధుబాల తండ్రి పంపలేదు. అలా మధుబాలకు హాలీవుడ్ అవకాశం లేకుండా చేశాడు. మధుబాల గుణం చాలా మంచింది. క్రమశిక్షణతో నడచుకునేవారు. సెట్స్ మీదకు నిర్మాతల కంటే ముందే తన కార్లో వచ్చేవారు. ఎలాంటి డిమాండ్లు చేసేవారు కాదు. దానధర్మాలు చేసేవారు. స్టార్ హీరోయిన్ అయిన తర్వాతే డాన్స్ నేర్చుకున్నారు. ఇంగ్లీష్‌ను కూడా పట్టుదలతో నేర్చుకున్నారు. ఎక్కువగా మేకప్ చేసుకునేవారు కాదు. ఆమెది సహజ సౌందర్యం. ఆమెతో నటించే వారు కూడా ఆమె అందాన్ని చూస్తూ అలా ఉండిపోయేవారు.దిలీప్‌కుమార్‌ను గాఢంగా ప్రేమించారు మధుబాల.
దిలీప్‌కుమార్(Dilip kumar) కూడా అంతే! అంతకు ముందు ప్రేమ్‌నాథ్‌ను ప్రేమించారు. ఈ రెండు విఫలమయ్యాయి. తర్వాత నట గాయకుడు కిశోర్‌కుమార్‌తో పెళ్లి జరిగింది. నిజంగా వీరిది విచిత్ర వివాహమే! దిలీప్, మధుబాలలు ప్రేమించుకుంటున్న రోజులలో వారిద్దరి మధ్య ప్రేమలేఖలు కిశోర్‌కుమారే చేరవేసేవారు. కిశోర్‌తో విడాకులు తీసుకున్న మొదటి భార్య రూమాదేవికి మధుబాల మంచి ఫ్రెండ్. కిశోర్‌తో రుమా గొడవపడుతున్నప్పుడు ..ఇలా పోట్లాడుకుంటే నేను కిశోర్‌ను పెళ్లిచేసుకుంటాను జాగ్రత్త అని సరదాగా అనేవారు మధుబాల. తర్వాతి రోజుల్లో అదే నిజమయ్యింది. 1956లో వచ్చిన ఢాకే కా మల్మల్ సినిమాలో మధుబాల, కిశోర్ మొదటిసారి కలిసి నటించారు. అది సూపర్‌హిట్టయ్యింది. తర్వాత 1958లో వచ్చిన చల్తీ కా నామ్ గాడీతో వారిద్దరూ హిట్ పెయిరయ్యారు. 1960లో మొహలోం కే ఖ్వాబ్ వచ్చింది. అదే ఏడాది ఝుమ్రూ విడుదలయ్యింది. 1962లో హాఫ్ టికెట్ వచ్చింది. ఝుమ్రూ, హాఫ్ టికెట్ మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు. రెండూ ఘన విజయం సాధించాయి. అప్పటికే మధుబాల టాప్ హీరోయిన్. తన పని తాను చేసుకుపోయేవారు తప్ప బయట ఎక్కడా కనిపించేవారు కాదు. అలాంటి అందాలతార తనతో మాట్లాడటం, తను వేసే జోకులకు పడిపడి నవ్వడం కిశోర్‌కుమార్‌కు ఒకింత గర్వంగా ఉండేది. అప్పటికే భార్య వదిలేసి పోవడంతో కొంచెం డిప్రెషన్లో ఉన్న కిశోర్‌కు మధుబాల ఓ గొప్ప స్వాంతన! మధుబాలకు కూడా కిశోర్ సరదా స్వభావం బాగా నచ్చింది.
హాఫ్ టికెట్ చిత్ర నిర్మాణం అప్పుడు పెళ్లి చేసుకుందానుకున్నారు. ఎప్పటిలాగే ఈ పెళ్లికి కూడా మధుబాల తండ్రి అడ్డుపడ్డాడు. అయితే దిలీప్‌కుమార్ వ్యవహారం తర్వాత కూతురి ఇష్టానికి ఎదురుచెప్పే సాహసం చేయలేకపోయాడు. కిశోర్ తల్లిదండ్రులకు కూడా ఓ ముస్లింయువతిని పెళ్లి చేసుకోవడం నచ్చలేదు. అయినప్పటికీ వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కాని వారు మాత్రం చివరి వరకు మధుబాలను స్వాగతించలేకపోయారు. ఆమె పట్ల ఉదాసీనంగానే వ్యవహరించారు. 1955 వరకు కిశోర్‌కుమార్‌కు ఒక్క హిట్ సినిమా కూడా లేదు. అప్పటికే మధుబాల 40కి పైగా సినిమాల్లో హీరోయిన్గా నటించి ఉన్నారు. దిలీప్‌కుమార్ వంటి అగ్రహీరోను వదిలేసి కిశోర్‌కుమార్ వంటి హాస్యనటుడుని మధుబాల పెళ్లి చేసుకోవడం చాలా మందికి నచ్చలేదు. మధుబాల మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. నా జీవితంలో హాయి అనుభవించేది అతని సమక్షంలో మాత్రమే అని చెప్పి 1960 అక్టోబరు 16న కిశోర్‌కుమార్‌ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మరుసటి రోజే సినిమాల నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించారు మధుబాల. మధుబాల ప్రకటన ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది.
అప్పటికే అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు కేసులు పెట్టారు.దాంతో వారితో రాజీ కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఎనిమిదేళ్ల వయసు నుంచి మొహానికి రంగులు వేసుకుని వేసుకుని అలసిపోయిన ఆమెకు 27 ఏళ్ల వయసులోనూ విముక్తి దొరకలేదు. ఆమె గుండెలో అప్పటికే రంధ్రం ఏర్పడింది. ఇంటి పట్టున ఉండి ఆరోగ్యం చూసుకోవాలనుకున్నారు. తన అనారోగ్య విషయాన్ని పెళ్లి కాకమునుపే కిశోర్‌కు తెలిపారు. విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకుంటే నయమవుతుందని అనుకున్నారు. కానీ ఈ వ్యాధికి విదేశాల్లో కూడా వైద్యం లేదని తర్వాత వారికి తెలిసింది. పెళ్లి తర్వాత తన ఆనారోగ్యం గురించి కిశోర్ పట్టించుకోవడం లేదనే అనుమానం మధుబాలకు కలిగింది. లండన్‌కు వెళ్లి చికిత్స చేయించుకుందామంటే కిశోర్ చూద్దాంటే అనేవాడు తప్ప కదిలేవాడు కాదు. కిశోర్ ఇలా చేస్తుండటం చూసిన ఓ పరిచయస్తుడు నేను వెంటబెట్టుకుని లండన్తీసుకెళతా అని మధుబాలతో అన్నాడు. అది విని కిశోర్ బిక్కచచ్చిపోయాడు. ఆ వెంటనే ఆమెను సొంత ఖర్చులతో లండన్‌కు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాతఇదేమీ తగ్గే వ్యాధి కాదని తెలిసింది.
ఆపరేషన్ చేయడానికి వీలు కాదని, ఏడాదిలోపు చనిపోయినా పోవచ్చని, లేదా పదేళ్లు బతకవచ్చని, పిల్లలు కనవద్దని, ఎటువంటి ఆందోళనా, మానసిక చింతా పెట్టుకోవద్దని ఇలా రకరకాల సూచనలు చేశారు డాక్టర్లు. మధుబాల ఇంత డెలికేట్ అని తెలియగానే కిశోర్‌కు ఉత్సాహం ఎగిరిపోయింది. పెళ్లికాకమునుపు సరదాగా ఉండే కిశోర్ పెళ్లయ్యాక ఉదాసీనంగా ఉండటం మధుబాల జీర్ణం చేసుకోలేకపోయారు. నర్గీస్ అనారోగ్యం పాలయినప్పుడు సునీల్ దత్ ఆమెకు అండగా, ఆసరాగా నిలబడ్డారు. ఆమెలో మానసిక స్థయిర్యాన్ని నింపారు. కానీ దానికి ముందు వాళ్లిద్దరూ ఎన్నో ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు. కిశోర్ విషయం అలా కాదు. పెళ్లయిన కొన్నాళ్లకే అనారోగ్యం విషయం బయటపడటంతో కిశోర్ మధుబాలకు దూరమవ్వడం మొదలుపెట్టాడు. భర్త నుంచి ఆదరణ లేదు. అత్తమామలు దగ్గరకు తీసుకోవడం లేదు. మెట్టినింట ఉండటం మధుబాలకు నచ్చలేదు. పుట్టింటికి వచ్చేసారు. ఆమె సినిమాల్లోంచి తప్పుకున్న తర్వాత ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. పైగా ఆరోగ్యం సరిగ్గా లేదు. అగ్ర కథనాయికగా ఉన్న తన జీవితం ఒక్కసారిగా ఇలా అవ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. ఆమె సినిమాల నుంచి వైదొలిగిన తర్వాత మెఘల్ ఏ ఆజమ్ సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది. ప్రేక్షకుల మనస్సుల్లో ఆమె అనార్కలిగా చిరస్థాయిగా నిలిచిపోయారు.
కాకపోతే ఆ స్టార్‌డమ్‌ను అనుభవించలేని పరిస్థితి ఆమెది. ఆమెలో కాన్ఫిడెన్స్ పోయింది. ఆమెకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది. కిశోర్ మెంటల్ బ్యాలెన్స్ కూడా అంతంత మాత్రమే కావడంతో ఇద్దరికి పొసగలేదు. చేజేతులా వారిద్దరు తమ జీవితాలను దర్భరం చేసుకున్నారు. ఆమెను చూసేందుకు తరచూ కిశోర్ అక్కడకు వెళ్లేవాడు. వచ్చినప్పుడల్లా కిశోర్‌ను మధుబాల ఏడిపించేవారు. తాను చనిపోయిన తర్వాత తన చెల్లెల్ని పెళ్లి చేసుకోమని అడిగేవారు. ఇప్పుడీ మాటలన్నీ ఎందుకు? నీకు ఏమీ కాదు అని కిశోర్ అనునయించేవాడు. అయినా వినకుండా మొండిపట్టుపట్టేవారు మధుబాల. సర్లే చూద్దాం అని కిశోర్ నోటి వెంట వచ్చే వరకు అలా అడుగుతూనే ఉండేవారు. పొరపాటున కిశోర్ ఆ మాట అంటే మాత్రం 'చూశావా.. నేను ఎప్పుడు చనిపోతానా, ఎప్పుడు నా చెల్లెల్నిచేసుకుందామా అని ఎదురుచూస్తున్నావు' అని దెప్పి పొడిచేవారు. ఇది తట్టుకోలేక మధుబాల ఇంటికి వెళ్లడం తగ్గించాడు కిశోర్. అప్పుడు కూడా మధుబాల తిట్టిపోసేవారు. 'నా మీద ప్రేమ ఉంటేగా.. నీ మొదటి భార్య మీద నీకు ప్రేమ ఇంకా తగ్గలేదు. అంత ప్రేమ ఉంటే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? ' అంటూ గొడవ పెట్టేవారు.
మధుబాల మళ్లీ సినిమాల్లో నటిస్తే మానసికస్థితి ఏమైనా మారవచ్చేమోనని అనుకున్నారు కిశోర్. కానీ అంతలోనే ఆమెపై ఈర్ష్య పెంచుకునేవాడు. ఆమె ఇంట్లో మొఘల్ ఏ ఆజమ్ సినిమా వేసుకుని చూస్తూ ఉంటే కోపం పెంచుకునేవాడు. చూసేదేదో చల్తీ కా నామ్ గాడీ చూడొచ్చుగా.. ఇది ఎందుకు చూస్తున్నావు? అంటూ కేకలు పెట్టేవాడు. ఆమెను చూసేందుకు అప్పుడప్పుడు దిలీప్‌కుమార్ కూడా వెళ్లేవారు. తాను కోలుకున్న తర్వాత తనతో మళ్లీ నటిస్తావు కదా? అంటూ అడిగేవారు దీనంగా. తప్పకుండా నటిస్తాను అంటూ ఆమెను ఓదార్చేవాడు దిలీప్‌కుమార్. 1962 వచ్చే సరికి మధుబాల ఆరోగ్యం మరింత విషమించింది. ఆమె నోటి వెంటనే తరచూ రక్తం పడేది. కిశోర్, మధుబాల విడాకులు తీసుకోలేదు కానీ విడివిడిగానే జీవించారు. ఆమె గుండెకు సంబంధించిన వ్యాధితో సుమారు దశాబ్దకాలం బాధపడ్డారు. చివరకు 1969, ఫిబ్రవరి 23న కన్నుమూశారు. అప్పుడామె వయసు కేవలం 36 ఏళ్లే! ఆమె శవపేటికను కిశోర్ భుజాన మోశాడు. మధుబాల చనిపోయిన సమయంలో దిలీప్‌కుమార్ గోపి సినిమా షూటింగ్ కోసం మద్రాస్‌కు వచ్చి ఉన్నారు. విషయం తెలిసి బాంబేకు వెళ్లేసరికి మధుబాల అంత్యక్రియలు అయిపోయాయి. చాలా బాధపడ్డారు దిలీప్. మధుబాల స్వర్గస్తులు అయిన చాన్నాళ్లకు కిశోర్ ఫిలింఫేర్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. మధుబాల తన స్నేహితుడు దిలీప్‌కుమార్ గర్ల్‌ఫ్రెండ్‌గానే గుర్తిండిపోయింది అని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.