ఆగస్టు 2021లో ఆమె అనారోగ్యం బారిన పడినట్లు ఆమె సోదరి విజయమ్మ చెప్పారు. ప్రస్తుతం రోజుల తరబడి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని అన్నారు. కనకలత ఆహారం తీసుకునే పరిస్థితిలో కూడా లేరని, కేవలం ద్రవ ఆహారపదార్థాలతోనే ప్రాణాలను నిలుపుకుంటున్నారని చెప్పారు. ఆమె తన రోజువారీ కాలకృత్యాలు సైతం మరచిపోతున్నారట!
ఒకప్పుడు తన చక్కటి నటనతో అభిమానులను అలరించిన నటి కనకలత(Kanaka Latha). ఆమె పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. మలయాళ సినిమాలు ప్రియం(Priyam), అధ్యతే కన్మణి(Adhyathe Kanmani) సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సినిమాలతో పాటు బుల్లితెర సీరియల్స్‌లోనూ నటించారామె! దాదాపు మూడు దశాబ్దాలపాటు మలయాళ, తమిళ సినీ పరిశ్రమలో కొనసాగారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన కనకలత జీవితం ప్రస్తుతం దుర్భరంగా ఉంది. ఆమెకు అల్జీమర్స్‌తో(Alzheimer's) పాటు పార్కిన్సన్స్(Parkinson's) వ్యాధి కూడా సోకింది.
ఆగస్టు 2021లో ఆమె అనారోగ్యం బారిన పడినట్లు ఆమె సోదరి విజయమ్మ చెప్పారు. ప్రస్తుతం రోజుల తరబడి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని అన్నారు. కనకలత ఆహారం తీసుకునే పరిస్థితిలో కూడా లేరని, కేవలం ద్రవ ఆహారపదార్థాలతోనే ప్రాణాలను నిలుపుకుంటున్నారని చెప్పారు. ఆమె తన రోజువారీ కాలకృత్యాలు సైతం మరచిపోతున్నారట! డైపర్లు ఉపయోగించాల్సి వస్తున్నదట! తన పేరు కూడా ఆమెకు గుర్తు లేదని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయమ్మ, ఆమె మేనల్లుడు కనకలత వద్దే ఉంటున్నారు. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న నటి 16 ఏళ్ల తర్వాత భర్త నుంచి విడిపోయింది.
ఆమెకు పిల్లలు లేరు. ప్రస్తుతం ఆమెకు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నుంచి నెలకు అయిదు వేల రూపాయల పెన్షన్ వస్తోంది. ఆమెకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. అలాగే అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్ (ATMA), ఫిల్మ్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం ఆమెకు అందుతోంది. కనకలత తన కెరీర్‌లో 360కి పైగా సినిమాల్లో నటించారు. ఆమె చివరిసారిగా పూక్కాలం అనే సినిమాలో నటించారు.