దాదాపు ఇటీవల దర్శకులు కూడా సహజనటి జయసుథకి ఓ ప్రత్యేకమైన పాత్రను ఊహించుకుని, ఆమెను సినిమాలో కేస్ట్ చేయడానికే తాపత్రయపడతారు. మంచి పాత్ర అయితే జయసుథ సినిమా సక్సెస్‌కి బాగా హెల్స్ అవుతారన్నది అందరికీ గట్టి నమ్మకం. కానీ ఎన్నాళ్ళు? సినిమా పోకడలు మారిపోతున్నాయి. కథావిష్కరణలు రూపాంతరం చెందుతున్నాయి. మరీ ఇటీవలి యంగ్‌ డైరెక్టర్స్‌ అయితే అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటైర్లీ డిఫరెంట్‌ జోనర్స్ టచ్ చేస్తూ హిట్స్ కొడుతున్నారు.

దాదాపు ఇటీవల దర్శకులు కూడా సహజనటి జయసుథకి ఓ ప్రత్యేకమైన పాత్రను ఊహించుకుని, ఆమెను సినిమాలో కేస్ట్ చేయడానికే తాపత్రయపడతారు. మంచి పాత్ర అయితే జయసుథ సినిమా సక్సెస్‌కి బాగా హెల్స్ అవుతారన్నది అందరికీ గట్టి నమ్మకం. కానీ ఎన్నాళ్ళు? సినిమా పోకడలు మారిపోతున్నాయి. కథావిష్కరణలు రూపాంతరం చెందుతున్నాయి. మరీ ఇటీవలి యంగ్‌ డైరెక్టర్స్‌ అయితే అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటైర్లీ డిఫరెంట్‌ జోనర్స్ టచ్ చేస్తూ హిట్స్ కొడుతున్నారు. ఈ యంగ్‌ హీరోలకి జయసుధ పూర్తిగా అవుట్‌ డేట్‌ అవుతారనే ఆలోచనతో కొంచెం సీనియర్‌ యాక్ట్రస్‌ల వైపుకి మళ్ళిపోతున్నప్పుడు జయసుధకి పాత్రలు కరువవుతున్నాయి. పైగా ఆమె రెమ్యూనరేషన్‌ కూడా తలకు మించిన లేదా ఆ పాత్రకు మించిన భారమవుతుందనే వ్యూతో డైరెక్టర్‌ అలోచించుకుంటున్నారు. ఆ తోవలోనే హిట్స్ కూడా కొడుతున్నారు. మామ్మూలుగా అయితే దసరా సినిమాలో ఝాన్సీ చేసిన పాత్ర జయసుధ చేయొచ్చు. కానీ మరీ ఏజ్డ్‌గా కనిపించొచ్చన్న ఆలోచనతోనే జయసుథకి బదులు ఝాన్సీని తీసుకున్నారని వినిపించింది. ఇదే వ్యవహారం అన్ని చోట్లా ప్రస్తుతం జయసుధకి ఎదురవుతోంది. అలాగని పూర్తిగా లేకపోలేదు. అక్కడక్కడ ఆడపాతడపా ఉంటున్నాయి. అవీ పెద్ద బడ్జెట్‌ చిత్రాలు కావడమన్నది సహజంగానే జరుగుతోంది.

ఈ కారణంగా వచ్చిన, వస్తున్న గ్యాప్‌ని కవర్‌ చేసుకోవడానికి జయసుథ మరో అడుగు ముందేసి, హాలీవుడ్‌ చిత్రం వైపుకు తన ప్రస్థానాన్ని మళ్ళించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఫాలింగ్‌ యాషెస్‌ అనే ఇంగ్లీష్‌ ఫిల్మ్‌లో మెయిన్‌ క్యారెక్టర్‌ చేయడానికి సైన్‌ చేసి, యుస్‌ మకాం మార్చారు. ఆదీ కూడా ఈ మధ్యరోజుల్లో బాగా ప్రచారంలోకి వచ్చిన యుస్ వ్యక్తిని ఆమె మూడో వివాహం చేసుకున్నారని బాగా సోషల్‌ మీడియాలో ప్రచారం బాగానే జరిగింది. అయితే దానికి జయసుథ ప్రత్యేకంగా సమాధానమూ చెప్పలేదు. సంజాయిషీ ఇవ్వలేదు. కామ్‌గా ఉండిపోయారు. ఫలితంగా ఎవరి ఊహాగానాలు వారు, ఎవరి వ్యాఖ్యానాలు వారు చేశారు. జయసుథ ఇవేవీ పట్టించుకోనేలేదు. అతని పేరు ఫిలిప్పే. ఇతని కాంబినేషన్‌లోనే జయసుథ ఈ ఆంగ్ల చిత్రంలో నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇందులో ఇంకో మెలిక దాగుంది. ఇప్పుడెలా అయితే నరేష్‌, పవిత్రాలోకేష్‌ వివాహం చేసుకోకుండానే దంపతులుగా సోషల్‌ మీడియాని హోరెత్తించేశారో, ఇద్దరి వైవాహిక వ్యవహారానికి తెరరూపం కల్పిస్తున్నారో, జయసుథ కూడా అదే బాటలో నడుస్తున్నారేమోనన్న ఊహగానం ఊపందుకుంది. ఇది కాకపోయినా, తెలుగులో చిత్రాల జోరు తగ్గుతున్న వేళలో, హారీవుడ్‌లో ఈ సినిమాతో అవకాశాలు రావచ్చు అనే ప్లానింగ్‌తోనే జయసుథ ఈ సినిమాకి ఒప్పుకున్నారని ఓ పెద్ద నిర్మాత అనుకుంటున్నారు. ఏది ఏమైనా సరే ఒక దెబ్బకి రెండు పిట్టలు కూడా కావచ్చు. రెండిట్లోనూ జయసుథకి ఉన్నది ఎడ్వాంటేజే.

Updated On 22 April 2023 6:56 AM GMT
Ehatv

Ehatv

Next Story