ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమని(Aamani) గురించి ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. తెలుగులో జంబలకిడిపంబ(Jambalakidipamba) సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ సినిమా బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మిస్టర్‌ పెళ్లాం(Mister Pellam) సినిమాతో తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమని(Aamani) గురించి ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. తెలుగులో జంబలకిడిపంబ(Jambalakidipamba) సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ సినిమా బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది. తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మిస్టర్‌ పెళ్లాం(Mister Pellam) సినిమాతో తెలుగువారికి బాగా దగ్గరయ్యారు. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పట్లో తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత సినిమా రంగం నుంచి తప్పుకున్న ఆమని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఈ ఏడాది ఆమె నటించిన వినరో భాగ్యము విష్ణు కథ, అల్లంత దూరాన సినిమాలు మంచి పేరు తెచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు ఆమని. ముఖ్యంగా క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. 'హీరోయిన్లలకు క్యాస్టింగ్‌ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి.

అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవరికీ ఈ విషయాలు తెలిసేవి కావు. ఏ ప్రొఫెషన్‌లో అయినా మంచి చెడు రెండూ ఉంటాయి. మంచేదో చెడేదో మనం నిర్ణయించుకోవాలి. తమిళంలో ఇలాంటి పరిస్థితి నాకు చాలాసార్లు ఎదురయ్యింది. చిన్న చిన్న సంస్థలలో ఇలాంటి ఎక్కువగా జరిగేవి. నాకు ఓసారి స్విమ్మింగ్‌ పూల్ సీన్‌ కోసమని డ్రెస్‌ తీశారు. ఏమైనా స్ట్రెచ్‌ మార్కులు ఉన్నాయేమో చూడాలి అన్నారు. కానీ దానికి నేను ఒప్పుకోలేదు. నేను అలాంటి క్యారెక్టర్లు చేయను అని మొహం మీద చెప్పేశాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కొందరు అడ్వాన్స్ ఇచ్చిన వెంటనే ఫోన్‌ చేసేవారు.

డైరెక్టర్‌ స్టోరీ గురించి మాట్లాడాలన్నారు. మీరు రావాలి అని మేనేజర్‌ ఫోన్‌ చేసేవాడు. కానీ ఈ విషయాలు నాకు చాలా రోజులకు అర్థమయ్యేవి' అని ఆమని తెలిపారు. అప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి ఆమని వివరించారు. 'అప్పుడు సెల్‌ఫోన్స్ లేవు కదా. డైరెక్ట్‌గా మేనేజర్ వచ్చి మాట్లాడేవారు. డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలని అన్నారు. అది కూడా ఓ బీచ్ దగ్గర అని చెప్పారు. అక్కడికి మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఫైనాన్షియర్ వస్తున్నారు మిమ్మల్ని చూడాలంటా అన్నారు. అసలు ఫైనాన్షియర్ నన్ను ఎందుకు చూడాలి? డైరెక్టర్, నిర్మాత చూస్తే చాలు కదా. ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలి. ఎందుకంటే ఆయన పక్కన నటించేవారు కాబట్టి తప్పదు. కానీ ఫైనాన్షియర్ చూడటమేంటి? అని అనుమానం వచ్చేది. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది. ఒక్కోసారి మమ్మీ వద్దండీ.. మీరు మాత్రమే రండి అని కారు తీసుకొచ్చే వారు. అక్కడే నాకు వారి దురాలోచన అర్థమయ్యేది. ఐసారీ.. నేను రాను అని గట్టిగా చెప్పేదాన్ని. ' అంటూ ఆమని చెప్పుకొచ్చారు.

Updated On 10 Aug 2023 4:49 AM GMT
Ehatv

Ehatv

Next Story