సీనియర్ సినీ నటుడు శరత్ బాబు(sharath babu) ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. చెన్నై(chennai) నుంచి బెంగళూరుకు.. బెంగళూరు నుంచి శరత్ బాబును హైదరాబాద్ తరలించారు. అయినా శరత్ బాబు ఆరోగ్యం విషయంగానే ఉంది.
సీనియర్ సినీ నటుడు శరత్ బాబు(sharath babu) ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తోంది. చెన్నై(chennai) నుంచి బెంగళూరుకు.. బెంగళూరు నుంచి శరత్ బాబును హైదరాబాద్ తరలించారు. అయినా శరత్ బాబు ఆరోగ్యం విషయంగానే ఉంది.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు శరత్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. శరీరం మొత్తానికి ఇన్ఫెక్షన్(Infection) వ్యాపించిందని, ఇది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్(Multi organ failure) కు దారి తీయవచ్చని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో(ICU) వెంటిలేటర్ పై శరత్ బాబుకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ట్రీమ్మెంట్ కొనసాగుతుంది. పరిస్థితి ఏమిటీ అనేది ఇప్పుడే వెల్లడించలేము అన్నారు డాక్టర్లు. చెన్నైలో ఉంటున్న శరత్ బాబు అనారోగ్యంతో చెన్నైలో ని ప్రైవేట్ హస్పిటల్ లో చేరారు.
చెన్నైలో చికిత్స తీసుకుంటుండగా..పరిస్థితి మరింత విషయంగా తయారు అయ్యింది. కాస్త కోలుకున్నారు అనుకునే లోపు.. ఆయన మరోసారి అస్వస్థతకు గురి కావటంతో బెంగళూరుకు ఆయన్ను తరలించారు. బెంగళూరులో కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో..ఈనెల 20న బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది.
శరత్ బాబు శరీరంలో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు దెబ్బతిన్నట్లు సమాచారం. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని డాక్టర్లు వెల్లడించారు. శరత్ బాబు ఆరోగ్యంపై ఈ రోజు సాయంత్రం బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శరత్ బాబు పరిస్థితి తెలిసి ఫిల్మ్ ఇండస్రీ పెద్దలు ఆరా తీస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.
రామరాజ్యం(Rama Rajyam) అనే చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు. తెలుగు(Telugu),తమిళ(tamil), కన్నడ(kannada) మళయాల(malyalam) సినిమాల్లో స్టార్ నటుడిగా కొనసాగారు శరత్ బాబు. మూడుముళ్ల బంధం(mudumulla bandham), సీతాకోక చిలుక(sithakoka chiluka), సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాందవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. హిందీ చిత్రాల్లోనూ నటించి మెప్పించిచారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. నెగిటివ్ రోల్స్ లో సైతం ఆయన మెప్పించారు. శరత్ బాబు మొత్తంగా 200 సినిమాలకు పైగా చేశారు. చివరిగా ఆయన నటించిన సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన వకీల్ సాబ్ లో .. సీనియర్ అడ్వకేట్ గా క్యామియో రోల్ చేశారు.