తమిళ నటి రాధిక(Radhika) గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె తెలుగువారికి కూడా చాలా దగ్గరయ్యారు. చిరంజీవి(chiranjeevi)- రాధిక(Radhika) కాంబినేషన్ అప్పట్లో సూపర్‌హిట్‌. ఎన్నో అద్భుతమైన పాత్రలలో ప్రేక్షకులను అలరించిన బహుభాషా నటిగా పేరు పొందారు రాధిక. ఆమె నిర్మాతగా పలు సినిమాలు, సీరియళ్లు తీశారు. ఆరు పదుల వసంతాలను దాటిన రాధిక ఇప్పటికీ నాట్‌ అవుట్‌గా నటిస్తూనే ఉన్నారు.

తమిళ నటి రాధిక(Radhika) గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె తెలుగువారికి కూడా చాలా దగ్గరయ్యారు. చిరంజీవి(chiranjeevi)- రాధిక(Radhika) కాంబినేషన్ అప్పట్లో సూపర్‌హిట్‌. ఎన్నో అద్భుతమైన పాత్రలలో ప్రేక్షకులను అలరించిన బహుభాషా నటిగా పేరు పొందారు రాధిక. ఆమె నిర్మాతగా పలు సినిమాలు, సీరియళ్లు తీశారు. ఆరు పదుల వసంతాలను దాటిన రాధిక ఇప్పటికీ నాట్‌ అవుట్‌గా నటిస్తూనే ఉన్నారు. నటిగా 45 వసంతాలను పూర్తి చేసుకున్నారు. 1978లో వచ్చిన కిళక్కే పోగుమ్‌ రైల్‌(Kilakke Pogum Rail) అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు రాధిక. ఆ సినిమాకు భారతీరాజా దర్శకత్వం వహించారు. మన సుధాకర్‌(sudhakar) అందులో హీరో! ఈ సినిమా అక్కడ సూపర్‌డూపర్‌ హిట్టయ్యింది. తెలుగులో బాపు దీనిని తూర్పు వెళ్లే రైలుగా(Thurpu velle Railu) తీశారు. కిలక్కే పోగుమ్‌ రైల్‌ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. పాటలన్నీ హిట్టే! ముఖ్యంగా ఈ చిత్రంలోని పూవరసంపు పూతాచ్చి అనే పాట ఇప్పటికీ తమిళనాడులో మారుమోగుతూనే ఉంది. ఈ సినిమా తర్వాత రాధికకు వరసగా ఆఫర్లు వచ్చాయి. తెలుగు, హిందీ భాషల్లోనూ రాధిక నటించి తన సత్తా చాటుకున్నారు. ఇప్పటికే దాదాపు వంద సినిమాలకు పైగా నటించారు రాధిక. పలు రాష్ట్ర, జాతీయ అవార్డులను గెల్చుకున్నారు. ఆమె నిర్మించి, నటించిన ఒరు కాదల్‌ కథై(Oru Kadal Kathai) సినిమా దర్శకుడికి ఇందిరాగాంధీ అవార్డు లభించింది. కాగా నటిగా 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రాధిక వేడుక జరుపుకున్నారు. తన భర్త శరత్‌కుమార్‌తో కలిసి కేక్‌ కట్‌ చేసి సంబరం జరుపుకున్నారు. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated On 12 Aug 2023 8:07 AM GMT
Ehatv

Ehatv

Next Story