టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్(Actor Naresh) చేస్తున్న హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ను పెళ్ళాడటం. తన కథను మళ్లీ పెళ్ళి పేరుతో సినిమాగా చేయడం.. నెటిజన్ల విమర్షలు.. అంతా హడావిడిగాసాగిపోతోంది. ఈక్రమంలో నరేష్ తనకు ప్రాణ హాని ఉంది అని సరికొత్త పల్లవి అందుకున్నారు. తనకి తుపాకీ లైసెన్స్‌ కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.

నాకు ప్రాణ హాని ఉంది.. అందకే ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్స్‌ ఇవ్వాలంటూ పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డి(Puttaparthi SP Madhava Reddy)కి అప్లికేషన్ పెట్టారు నటుడు నరేష్(Actor Naresh). ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్(Actor Naresh) చేస్తున్న హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ను పెళ్ళాడటం. తన కథను మళ్లీ పెళ్ళి పేరుతో సినిమాగా చేయడం.. నెటిజన్ల విమర్షలు.. అంతా హడావిడిగాసాగిపోతోంది. ఈక్రమంలో నరేష్ తనకు ప్రాణ హాని ఉంది అని సరికొత్త పల్లవి అందుకున్నారు. తనకి తుపాకీ లైసెన్స్‌ కావాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. తన ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్స్‌ ఇవ్వాలంటూ పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డికి విన్నవిచుకున్నారు నరేష్.

ఈ ఏడాది ఫిబ్రవరిలో నరేష్ ఇంటి పై దాడి జరిగింది. ఫిబ్రవరి 18న గచ్చిబౌలిలోని నరేష్ ఇంటిపై కొందరు దుండగులు దాడికి పాల్పడి ఇంటి ముందు పార్క్ చేసిన కారుని ధ్వంసం చేశారు. నరేష్ ఆ విషయం పై పోలీసు కేసు కూడా పెట్టారు. ఇక అది జరిగిన ఇన్ని నెలల తరువాత నరేష్ గురువారం (జులై 6) న తనకు తుపాకీ లైసెన్స్ కావాలి అని అడగడం చర్చనీయాంశం అయ్యింది.

ముఖ్యంగా తన మూడో భార్య రమ్యా రఘుపతిపై నరేష్ అనుమానం వ్యాక్తం చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో హీరోగా సూపర్ హిట్ సినిమాలు చేశారు నరేష్.. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి.. ఆడియన్స్ ను అలరించారు. యంగ్ హీరోలక ఫాదర్ పాత్రల్లో జీవించేశారు. ఇక ఇప్పటి వరకూ నరేష్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు. నాలుగోసారి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. ఈ వివాదం గత ఏడాదిగా నడుస్తూనే ఉంది. నరేష్ తో పాటు.. పవిత్ర లోకేష్ కూడా ఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతూనే ఉన్నారు.

Updated On 6 July 2023 11:26 PM GMT
Ehatv

Ehatv

Next Story