తమిళంలో తుళ్లువదో ఇళమై సినిమా ద్వారా దర్శకుడిగా పరచయమయ్యారు సెల్వరాఘవన్‌(Selvaraghavan). మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్న సెల్వరాఘవన్‌ తర్వాత కాదల్‌ కొండేన్‌, 7 జీ రెయిన్‌బో కాలనీ(7 G Rainbow Colony) వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం దర్శకత్వానికి కొంత దూరంగా ఉంటూ నటుడిగా బిజీ అయ్యారు. ఇన్నాళ్లకు మళ్లీ దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు. గతంలో ఈయనే తీసిన 7 జీ రెయిన్‌బో కాలనీ సినిమా తెలుగులో 7/G బృందావన్ కాలనీగా(7/G Brindavan Colony ) వచ్చింది..

తమిళంలో తుళ్లువదో ఇళమై సినిమా ద్వారా దర్శకుడిగా పరచయమయ్యారు సెల్వరాఘవన్‌(Selvaraghavan). మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్న సెల్వరాఘవన్‌ తర్వాత కాదల్‌ కొండేన్‌, 7 జీ రెయిన్‌బో కాలనీ(7 G Rainbow Colony) వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం దర్శకత్వానికి కొంత దూరంగా ఉంటూ నటుడిగా బిజీ అయ్యారు. ఇన్నాళ్లకు మళ్లీ దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారు. గతంలో ఈయనే తీసిన 7 జీ రెయిన్‌బో కాలనీ సినిమా తెలుగులో 7/G బృందావన్ కాలనీగా(7/G Brindavan Colony ) వచ్చింది.. ఇక్కడ కూడా విజయవంతం అయ్యింది. ఈ సినిమా అప్పట్లో యువతను బాగా అట్రాక్ట్ చేసింది. ఆ మాటకొస్తే తెలుగు ప్రేక్షకులలో ముద్రపడిపోయిన అనేకానేక ప్రేమకథా చిత్రాలలో 7/G బృందావన్ కాలనీ కూడా ఒకటి. రవికృష్ణ(Ravi Krishna), సోనియా అగర్వాల్‌(sonia Aggarwal) జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. 20 ఏళ్ల కిందట విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటుంది. ఈ సినిమా పాటలకు క్రేజ్‌ కూడా తగ్గలేదు.

ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను తీయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు సెల్వ రాఘవన్. మొదటి భాగంలో నిర్మాత ఎ.ఎం.రత్నం(AM Ratnam) కుమారుడు రవికృష్ణ హీరోగా పరిచయం అయ్యాడు. తర్వాత ఇతను నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దాంతో సినిమాలకు కనుమరుగయ్యాడు. అలాంటిది 7/G బృందావన్ కాలనీ సీక్వెల్‌ చిత్రం ద్వారా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. హీరో ఎంపికయ్యాడు బాగానే ఉంది. మరి హీరోయిన్‌ సంగతేమిటి? సోనియా అగర్వాల్‌ ఇప్పుడు సెట్‌ అవ్వదు కాబట్టి కథానాయిక పాత్ర కోసం నటి అదితి శంకర్‌(Adithi Shankar), ఇవనాలలో ఒకరిని ఎంపిక చేయాలనుకుంటున్నాడు సెల్వ రాఘవన్‌. వారితో చర్చలు జరుపుతున్నారు. ఈ ఇద్దరిలో ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాలి. అదితి శంకర్‌ నటించిన మావీరన్‌ చిత్రం ఇటీవలే విడుదలయ్యింది. మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అధర్వ తమ్ముడు ఆకాశ్‌ మురళీకి జంటగా ఓ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు లవ్‌ టుడే సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న నటి ఇవనా.. ఈమె నటుడు హరీశ్‌ కల్యాణ్‌కు జంటగా నటించిన ఎల్‌జీఎం చిత్రం శుక్రవారం విడుదలయ్యింది.. కాగా 7/G బృందావన్ కాలనీ చిత్రానికి సీక్వెల్‌ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే కానీ క్లారిటీ రాదు.

Updated On 28 July 2023 2:58 AM GMT
Ehatv

Ehatv

Next Story