బంగ్లాదేశ్(Bangladesh) క్రికెటర్‌తో డేటింగ్ చేయాలనుకున్న పాకిస్తాన్ నటి సేహర్ షిన్వారి(Sehar Shinwari) కోరిక తీరకుండా పోయింది. వరల్డ్‌కప్‌లో ఇండియాపై(India) బంగ్లాదేశ్ కనుక విజయం సాధిస్తే ఆ దేశ క్రికెటర్‌తో ఢాకాలో డేటింగ్(Dating) చేస్తానని ప్రకటించింది.
బంగ్లాదేశ్(Bangladesh) క్రికెటర్‌తో డేటింగ్ చేయాలనుకున్న పాకిస్తాన్ నటి సేహర్ షిన్వారి(Sehar Shinwari) కోరిక తీరకుండా పోయింది. వరల్డ్‌కప్‌లో ఇండియాపై(India) బంగ్లాదేశ్ కనుక విజయం సాధిస్తే ఆ దేశ క్రికెటర్‌తో ఢాకాలో డేటింగ్(Dating) చేస్తానని ప్రకటించింది. అయితే ఇది జరగని పనేనని తెలిసే ఈ మాటన్నదేమో! గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
బంగ్లాదేశ్ క్రికెటర్లను రెచ్చగొట్టే రీతిలో పాక్ నటి సేహారి షిన్వారి పోస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే బంగ్లా కూడా ఓడిపోవడంతో ఆ నటి ఇప్పుడు కొత్త మాట అందుకుంది. బంగ్లా టైగర్స్ బాగా ఆడారని, కనీసం వారైనా ఇండియాకు సొంత గడ్డపై గట్టి పోటీ ఇచ్చారని తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాసుకొచ్చింది. అలా పరోక్షంగా తన దేశం పాక్‌పై సెటైర్లు వేసింది.