✕
1934లో సి.పుల్లయ్య (pullaiah)దర్శకత్వంలో వచ్చిన తొలి లవకుశ(lavakusha)లో సీత పాత్రను వేసింది సీనియర్ శ్రీరంజని (sr.sriranjani). ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. విజయవాడ దుర్గకళామందిర్ (durgakalamandir) దగ్గర ఆ రోజుల్లో రైవస్ కాలవ పొడవునా ఎడ్లబళ్లే!చుట్టుపక్కన గ్రామాల ప్రజలు బళ్లేసుకుని సినిమాకు వచ్చేవారు. సాక్షాత్తూ సీతాదేవినే వచ్చి సినిమాలో కనిపించిందన్నంతగా ప్రజలు నమ్మారు.

x
Memories of Veteran Actress Anjali Devi
-
- 1934లో సి.పుల్లయ్య (pullaiah)దర్శకత్వంలో వచ్చిన తొలి లవకుశ(lavakusha)లో సీత పాత్రను వేసింది సీనియర్ శ్రీరంజని (sr.sriranjani). ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకుంది. విజయవాడ దుర్గకళామందిర్ (durgakalamandir) దగ్గర ఆ రోజుల్లో రైవస్ కాలవ పొడవునా ఎడ్లబళ్లే!చుట్టుపక్కన గ్రామాల ప్రజలు బళ్లేసుకుని సినిమాకు వచ్చేవారు. సాక్షాత్తూ సీతాదేవినే వచ్చి సినిమాలో కనిపించిందన్నంతగా ప్రజలు నమ్మారు. వాల్‌పోస్టర్లలో, పుస్తకాలలో శ్రీరంజని బొమ్మను కత్తిరించి ఇంట్లో గోడలకు అతికించుకునేవారు. భక్తితో పూజలు చేసేవారు. సినిమా విడుదలయ్యాక సీతమ్మ వేషమేసిన శ్రీరంజనికి అనేకచోట్ల ఘన సన్మానాలు జరిగాయి. సత్కారాలు జరిగాయి. మద్రాస్ క్రౌన్ టాకీస్‌లో జరిగిన శతదినోత్సవ వేడుకకు అప్పటి మద్రాస్ గవర్నర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఘనమైన స్వర్ణ పతకాన్ని శ్రీరంజనికి బహూకరించారు
-
- సీనియర్ శ్రీరంజనికి లవకుశనే మొదటి సినిమా కావడం విశేషం. అంతకు ముందు నాటకాలు వేసిన అనుభవమే ఉండిందావిడకు! ఆమె అద్భుతమైన గాయని కూడా! కానీ 33వ ఏటనే క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. ఆవిడ చెల్లెలే జూనియర్ శ్రీరంజని. గుణసుందరికథ (gunasundarikatha)లో హీరోయిన్ ఈమెనే! అక్క భర్త నాగుమణినే ఈమె పెళ్లి చేసుకున్నారు. ఇది అక్క చివరి కోరిక. అక్క పిల్లలను తన పిల్లలుగా పెంచి పెద్ద చేశారు. ప్రమీలార్జునీయం, గూఢచారి 116 (gudhachari 116)వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన మంగళగిరి మల్లికార్జునరావు సీనియర్ శ్రీరంజని కుమారుడే!
-
- రెండో లవకుశలో సీతమ్మ పాత్రధారి అంజలీదేవి(anjalidevi)కి కూడా ఇంతే అదరణ లభించింది. విపరీతమైన పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. గ్రామీణులు అంజలీదేవిని కూడా సీతమ్మగా భావించారు. భక్తితో ఆరాధించారు. లవకుశ కంటే ముందు అంజలీదేవి సతీ అనసూయ (sathiansuya), చెంచులక్ష్మి, సతీ సులోచన వంటి పౌరాణిక సినిమాల్లో నటించారు. కానీ లవకుశ సినిమా అంజలీదేవి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. అవుట్డోర్ షూటింగ్ కోసం ఆమె బయటకు వెళుతుంటే పల్లెటూళ్లలో జనం ఆమె కారు ఆపి నమస్కరించేవారు. భూదేవి ముద్దుబిడ్డవు నువ్వు. నీ చేత్తో తాకితే మాకు ఇక ఏడాదంతా పంటలే అంటూ వరికంకులను ఆమె పాదాల దగ్గర ఉంచేవారు! కాళ్లకు నమస్కరించేవారు. మహిళలు అయితే హారతులిచ్చేవారు. పసుపు కుంకుమలను సమర్పించుకునేవారు. పాదాలకు మొక్కేవారు. కొందరైతే ఆమె చీరె కొంగును తాకి కళ్లకు అద్దుకునేవారు.
-
- విచిత్రమేమిటంటే అంజలీదేవిని సీత పాత్రను ఇవ్వడం చాలా మందికి నచ్చలేదు. డ్యాన్సులు గట్రాలు చేసుకునే అంజలీని సీతగా చూపించడమేమిటి? అని పుల్లయ్యను నిలదీశారు కొందరు. పుల్లయ్య వీటిని అసలు పట్టించుకోలేదు. అంజలీదేవిని ఆయన నమ్మారు. ఆ నమ్మకాన్ని ఆమె వమ్ము చేయలేదు. సీతమ్మంటే అంజలీదేవినే అన్నంతగా ఆమె పేరు స్థిరపడింది...

Ehatv
Next Story