ది కేరళ స్టోరీ చిత్రాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేరళ స్టోరీ నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాను నిషేదించిన తమిళనాడు ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ది కేరళ స్టోరీ(The Kerala Story) చిత్రాన్ని పశ్చిమ బెంగాల్(West Bangal) ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేరళ స్టోరీ నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు(Notice) జారీ చేసింది. ఈ సినిమాను నిషేదించిన తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్(Dhananjaya Y. Chandrachud) మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎందుకు నిషేధించింది.. ఎందుకు నడపనివ్వడం లేదని ప్రశ్నించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సినిమా నడుస్తోంది. సినిమా మంచిదైనా, చెడ్డదైనా కావచ్చు కానీ బ్యాన్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. సినిమా ఎలా ఉంటుందో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ఈ విషయమై సమాధానం కోరుతూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై తదుపరి విచారణ మే 17న సుప్రీంకోర్టులో జరగనుంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banergee) ద్వేషం, హింసాత్మక ఘటనలను నివారించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ కేరళ స్టోరీని రాష్ట్రంలో ప్రదర్శించడాన్ని వెంటనే నిషేధించాలని ఆదేశించారు. ఇదిలావుంటే.. ది కేరళ స్టోరీకి నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా(Vipul Amruth Lal Shah) కాగా.. సుదీప్తో సేన్(Sudipto Sen) దర్శకత్వం వహించారు. తన నటనతో సినిమాకు ప్రాణం పోసిన అదా శర్మ(Adah Sharma) ఈ చిత్రంలో కథానాయిక.