శరత్ బాబు(sarath babu) ఆరోగ్యంపై సోషల్ మీడియాలో(Social media) రకరకాల రూమర్లు(Rumours) వినిపిస్తున్నాయి. ఏకంగా ఆయన మరణించారన్న వార్త వైరల్ అయ్యింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై స్పందించారు.

sarath babu health
శరత్ బాబు(sarath babu) ఆరోగ్యంపై సోషల్ మీడియాలో(Social media) రకరకాల రూమర్లు(Rumours) వినిపిస్తున్నాయి. ఏకంగా ఆయన మరణించారన్న వార్త వైరల్ అయ్యింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై స్పందించారు.
సీనియర్ యాక్టర్ శరత్ బాబు ఆరోగ్యంపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆయన మరణించారంటూ..ప్రచారం జరిగింది. కొన్ని మీడియా సంస్థల్లో కూడా ఈన్యూస్ రావడంతో.. ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. అయితే ఈ విషయంలో శరత్ బాబు కుటుంబ సభ్యులు స్పందించడంతో.. కాస్త క్లారిటీ వచ్చింది. శరత్ బాబు సోదరి(sister) సోషల్ మీడియాలో వస్తున్న పూకార్లపై ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు. ఆవిడ ఏమన్నారంటే..?
సోషల్ మీడియా లో శరత్ బాబు గారి గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుగా వస్తున్నాయి..శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యారు. ఐసీయు(ICU) నుంచి రూమ్ కు షిఫ్ట్ చేయడం జరిగింది..తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారు అని ఆశిస్తున్నాను....సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవి నమ్మవద్దు అని నా విజ్ఞప్తి అంటూ.. ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు శరత్ బాబు సోదరి.
నిన్న రాత్రి శరత్ బాబు మరణించారంటూ వదంతులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతే కాదు కొంత మంది పీఆర్ లు రిప్ అంటూ పోస్ట్ పెట్టడంతో పాటు..కుష్బు(Kushbu)లాంటి స్టార్స్ కూడా నివాళి అర్పిస్తూ..ట్వీట్ చేశారు. దాంతో ఈ న్యూస్ అంతట వైరల్ అయ్యింది. అయితే అసలు విషయం తెలుసుకుని.. ట్వీట్లు తొలగించారు. తున్నాయి. ఈ వార్తలు విని ఆయన అబిమానులు కంగారుపడుతున్నారు. అయితే శరత్ బాబు ఆరోగ్యంపై రకరకాల వదంతులపై.. ఆయన అభిమానులు కంగారు పడుతున్నారిు.
అయితే తాజా సమాచారం ప్రకారం శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. శరత్ బాబు ఆర్గాన్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారని.. అంత త్వరగా కోలుకునే అవకాశం లేదు అని టాక్ వినిపిస్తుంది. శరత్ బాబుకు ట్రీట్ మెంట్ కొనసాగుతుందని.. ఆయన కండీషన్ ఇంకా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో AIG హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.
కొంత కాలం క్రితం తీవ్ర అస్వస్థతతకు గురైన శరత్ బాబును చెన్నైలోని(chennai) ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.అక్కడ పరిస్థితి మెరుగు అవ్వకపోవడంతో.. వెంటనే బెంగళూరు కు ఆయన్ను మార్చారు. అక్కడ కోలుకున్ ట్టేకోలుకుని..మళ్లీ సీరియస్ అవ్వడంతో.. వెంటనే హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. వారు చెప్పేదాన్ని బట్టి.. అసలు సంగతిపై క్లారిటీ వస్తుంది.
శరత్ బాబు కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన నటించిన లాస్ట్ మూవీ పవర స్టార్ పవర్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా. ఈమూవీలో క్యామియో రోల్ చేశారు శరత్ బాబు. ఆయన కెరీర్ లో దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించారు శరత్ బాబు. తనకంటే పెద్దదైన కమెడియన్ రమా ప్రభను పెళ్లాడి.. కొన్ని సంవత్సరాలకు విడాకులు తీసుకున్నారు. ఆతరువాత శరత్ బాబు మరో రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు.
