'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' షోలో జాస్మిన్ పాత్ర పోషించిన నటి వైభవి ఉపాధ్యాయ మంగళవారం ఉదయం కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన కారు ప్రమాదంలో వైభవి మృతి చెందింది. ఆమె వయస్సు 32 సంవత్సరాలు. చండీగఢ్‌లోని కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ముంబైకి తరలిస్తున్నారు.

Sarabhai Vs Sarabhai Actor Vaibhavi Upadhyaya Dies In Car Accident
'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' షో(Sarabhai Vs Sarabhai )లో జాస్మిన్(Jasmine) పాత్ర పోషించిన నటి వైభవి ఉపాధ్యాయ(Vaibhavi Upadhyaya) మంగళవారం ఉదయం కన్నుమూశారు. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో జరిగిన కారు ప్రమాదం(Car Accident)లో వైభవి మృతి చెందింది. ఆమె వయస్సు 32 సంవత్సరాలు. చండీగఢ్‌లోని కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ముంబై(Mumbai)కి తరలిస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ముంబైలో వైభవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సారాభాయ్ వర్సెస్ సారాభాయ్-2 లో వైభవితో కలిసి పనిచేసిన నిర్మాత-నటుడు జేడీ మజేథియా(Jamnadas Majethia) ఈ వార్తలను ధృవీకరించారు. మలుపు వద్ద టర్న్ తీసుకుంటుండగా వైభవి ఉపాధ్యాయ్ కారు లోయలో పడిపోయిందని ఆయన వెల్లడించారు. కారులో వైభవికి కాబోయే భర్త కూడా ఉన్నాడని.. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ(Instagram Story)లో ఒక పోస్ట్‌లో.. ఈ సంఘటన ఉత్తర భారతదేశం(North India)లో జరిగిందని చెప్పాడు జేడీ మజేథియా. తన పోస్ట్‌లో ఇలా వ్రాశాడు.. "జీవితం చాలా అనూహ్యమైనది. చాలా మంచి నటి, ప్రియమైన స్నేహితురాలు వైభవి ఉపాధ్యాయ్, సారాభాయ్ vs సారాభాయ్ లో 'జాస్మిన్' గా ప్రసిద్ధి చెందింది. ఆమె నార్త్‌లో ఒక ప్రమాదంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని కుటుంబం ముంబై తీసుకువస్తుంది. ముంబైలో రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. వైభవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు.
ప్రముఖ నటి దీపికా పదుకొనే(Deepika Padukone)తో పాటు 2020లో వచ్చిన ఛపాక్, 'తిమిర్' (2023) చిత్రాలలో కూడా వైభవి నటించింది. 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్' అనే టీవీ షోతో పాటు.. క్యా కసూర్ హై అమలా కా, ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ అనే డిజిటల్ సిరీస్‌లో ఆమె నటించింది.
