సెలబ్రిటీలు డబ్బును మంచినీళ్లులా ఖర్చు పెడుతుంటారు. మంచినీళ్ల కోసం కూడా డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. చిన్న చిన్న వస్తువులకే వేలు, లక్షలు పోసేస్తారు. కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరు. ఎంత డబ్బు పెడితే అంత హుందాగా ఉంటామన్నది వాళ్ల ఫీలింగ్‌.

సెలబ్రిటీలు డబ్బును మంచినీళ్లులా ఖర్చు పెడుతుంటారు. మంచినీళ్ల కోసం కూడా డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. చిన్న చిన్న వస్తువులకే వేలు, లక్షలు పోసేస్తారు. కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరు. ఎంత డబ్బు పెడితే అంత హుందాగా ఉంటామన్నది వాళ్ల ఫీలింగ్‌. చాలా కొద్ది మందే సింపుల్‌గా ఉండాలనుకుంటారు. అలాగే ఉంటారు కూడా! ఒకప్పటి బాలీవుడ్‌ నటి అమృతాసింగ్‌(Amrutha Singh) కూడా ఏది చేసినా భారీగానే చేస్తారు. చివరికి ముఖం తుడుచుకునే టవల్‌ను కూడా వేల రూపాయలకు కొంటారు.

ఈ విషయాన్ని బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ బయటపెట్టాడు. విక్కీ కౌశల్‌, సారా అలీ ఖాన్‌ జంటగా నటించిన చిత్రం జర హట్‌కే జర బచ్‌కే(Jara Hat Ke Jara Bach ke) జూన్‌ 2వ తేదీన విడుదల కాబోతున్నది . ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విక్కీ కౌశల్‌(vickey Kaushal), సారా అలీఖాన్‌లు(sara Ali Khan) ద కపిల్‌ శర్మ(The Kapil Sharma) షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు విక్కీ కౌశల్‌. ఓ రోజు సెట్‌లో సారా అలీఖాన్‌ తన తల్లి అమృతా మేడమ్‌ను తెగ తిడుతోంది. ఏమైంది? ఎందుకలా తిడుతున్నావు? అసలేం జరిగింది? అని అడిగాను. దానికి సారా జవాబిస్తూ మా అమ్మ 16 వందల రూపాయలు పెట్టి కొత్త టవల్‌ కొన్నది.

అందుకే కోప్పడుతున్నా అని చెప్పింది. టవల్‌కు అన్ని డబ్బులు ఎవరైనా పెడతారా అని తాను నమ్మలేదని, సారా జోక్‌ చేస్తున్నదేమోనని అనుకున్నానని విక్కీ అన్నాడు. తర్వాత గట్టిగా నిజం చెప్పు అని అడిగేసరికి, నిజమే చెబుతున్నానని పెద్దగా అరిచిందట. అప్పుడు కానీ విక్కీ నమ్మలేదు. 'నేను నిజంగానే షాకయ్యాను. 16 వందల రూపాయలు పెట్టి ఎవరైనా టవల్ కొంటారా? అందుకే సారా వాళ్లమ్మను తిట్టారు' అని విక్కీ అన్నారు.
విక్కీ మాట్లాడుతున్నప్పడే సారా మధ్యలో కలగజేసుకుంటూ 'మరి ఒక్క టవల్‌ కోసం ఎవరైనా అంత డబ్బు ఖర్చు పెడతారా? కావాలంటే వానిటీ వ్యాన్‌లో ఉన్న ఫ్రీ టవల్స్‌ వాడుకోవచ్చుగా' అని అన్నారు.

Updated On 1 Jun 2023 6:19 AM GMT
Ehatv

Ehatv

Next Story