Mega Family Celebrations: సంక్రాంతి సంబరాల్లో మెగా-అల్లు కుటుంబం..పవన్‌కల్యాణ్ మిస్సింగ్
సంక్రాంతి పండుగ రోజున బతుకు తెరువు కోసమో, చదువుల కోసమో వెళ్లిన కొడుకులు, కూతుళ్లు , అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అందరూ సొంతూరుకు వచ్చే అద్భుతమైన సందర్భం. ఇప్పుడందరూ పండుగ మూడ్‌లోనే ఉన్నారు. కుటుంబసభ్యులందరూ ఒక్కచోటకు చేరి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ కూడా సంక్రాంతిని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
సంక్రాంతి పండుగ రోజున బతుకు తెరువు కోసమో, చదువుల కోసమో వెళ్లిన కొడుకులు, కూతుళ్లు , అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అందరూ సొంతూరుకు వచ్చే అద్భుతమైన సందర్భం. ఇప్పుడందరూ పండుగ మూడ్‌లోనే ఉన్నారు. కుటుంబసభ్యులందరూ ఒక్కచోటకు చేరి పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ కూడా సంక్రాంతిని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. గతంలో పోలిస్తే ఈసారి సంక్రాంతి పర్వదినం మెగా ఫ్యామిలీకి చాలా ప్రత్యేకం. ఎందుకంటే రామ్‌చరణ్, ఉపాసనల కూతురు క్లీంకారకు ఇదే తొలి పండుగ. అలాగే గత నవంబర్‌లో పెళ్లి చేసుకున్న వరుణ్‌తేజ్-లావణ్య త్రిపాఠిలకు కూడా ఇదే మొదటి సంక్రాంతి. మెగా కుటుంబసభ్యులంతా సంక్రాంతి పండుగను బెంగళూరులోని ఫామ్‌హౌస్‌లో జరుపుకున్నారు. రెండు రోజుల కిందటే అందరూ అక్కడికి వెళ్లిపోయారు. ఇకపోతే ఈ పండుగ సందడిలో పవన్ కల్యాణ్ మినహా మెగా-అల్లు కుటుంబసభ్యులందరూ పాల్గొన్నారు. ఫ్యామిలీమెంబర్లంతా కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మగవారంతా లైట్ బ్రౌన్ కలర్ కుర్తా వేసుకున్నారు. ఆడవాళ్లందరూ ఎర్ర చీరలు ధరించారు.ఇప్పుడు కూడా కీంక్లార రూపం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.