స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh), జూనియర్ జంధ్యాలగా పేరుతెచ్చుకున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కిన కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్(aishwarya rajesh), మీనాక్షీ చౌదరి(Meenakshi Chowdhary) హీరోయిన్లుగా నటించిన ఈసినిమాకు బీమ్స్ సంగీతం అందించారు. ఈసినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయ్యి రచ్చ రచ్చ చేస్తోంది.

ఇప్పటికీ బాక్సాఫీస్(Box Office) దగ్గర కలెక్షన్ల సందడి చేస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. ఈ ఆడియన్స నుంచి అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈసినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువ రెస్పాన్స్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారిస్తుంది. ఇప్పటికే 300 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

అంతే కాదు ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా, దీని క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంకా ఆసక్తిని చూపుతున్నారు. ఒకటికి మూడు సార్ల ఈసినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు కామెడీ ప్రియులు. దీంతో ఈ చిత్రం ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో(Book Myshow)లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. బుక్ మై షోలో ఈ మూవీ కోసం ఏకంగా 3.5 మిలియన్ టికెట్ బుకింగ్స్ జరిగినట్లు చిత్ర యూనిట్వెల్లడించింది. ఇలా ఓ రీజినల్ చిత్రానికి ఈ స్థాయిలో టికెట్ బుకింగ్స్ జరగడం నిజంగా విశేషం.

ehatv

ehatv

Next Story