యానిమల్‌ సినిమా(Animal Movie) హిట్టయితే అయి ఉండవచ్చు. కలెక్షన్లు కుమ్మేస్తే కుమ్మి ఉండవచ్చు. కానీ సినిమాపైన చాలా రకాల విమర్శలు వచ్చాయి. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) రూపొందించిన ఈ సినిమాపై చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. అందులో ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌(Javed Akhtar) కూడా ఉననారు. మహిళలను కించపరుస్తూ తీసిన ఇలాంటి సినిమాలు విజయం సాధించడం సమాజానికి ప్రమాదకరం అని జావెద్‌ అక్తర్‌ వ్యాఖ్యానించారు.

యానిమల్‌ సినిమా(Animal Movie) హిట్టయితే అయి ఉండవచ్చు. కలెక్షన్లు కుమ్మేస్తే కుమ్మి ఉండవచ్చు. కానీ సినిమాపైన చాలా రకాల విమర్శలు వచ్చాయి. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) రూపొందించిన ఈ సినిమాపై చాలా మంది చాలా రకాలుగా విమర్శించారు. అందులో ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌(Javed Akhtar) కూడా ఉననారు. మహిళలను కించపరుస్తూ తీసిన ఇలాంటి సినిమాలు విజయం సాధించడం సమాజానికి ప్రమాదకరం అని జావెద్‌ అక్తర్‌ వ్యాఖ్యానించారు. జావేద్‌ కామెంట్లకు సందీప్‌రెడ్డి స్ట్రాంగ్‌ రియాక్షన్‌ ఇచ్చారు. జావెద్‌ సార్‌ రాసిన సినిమాల్లో ఇప్పటివరకూ ఒక్క అసభ్యకర సన్నివేశాన్ని కూడా తాను చూడలేదని, రచయితగా ఆయన్ను విమర్శించే స్థాయి తనది కాదని సందీప్‌రెడ్డి అంటూనే ఆయన కొడుకు ఫర్హాన్‌ అక్తర్‌ను(Farhan Akhtar) విమర్శించాడు. ' ఫర్హాన్‌ అక్తర్‌ మీర్జాపూర్‌(Mirzapur) అనే వెబ్‌ సిరీస్‌ తీశాడు. అందులో అన్నీ బూతులే. మరి ఈ నీతులేవో తన తనయుడికి కూడా చెబితే బావుండేది కదా.’ అని సందీప్‌ రెడ్డి అన్నాడు. అక్కడితో ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఆగిపోయి ఉంటుందిలే అని అనుకున్నారంతా! కానీ మళ్లీ సందీప్‌రెడ్డిపై జావేద్‌ అక్తర్‌ కౌంటర్‌ అటాక్ చేశారు. ‘నా సినీ రంగ ప్రస్థానంలో ఎక్కడా ఒక్క అసభ్య సన్నివేశం కూడా చూడలేదని సందీప్‌రెడ్డి అన్నాడు.. సంతోషం. అందుకే నన్ను అనలేక నా కుమారుడిని టార్గెట్‌ చేశాడు. అతడికి తెలియని విషయం ఏమిటంటే మీర్జాపూర్‌ సిరీస్‌లో నా కొడుకు నటించలేదు. కనీసం దర్శకుడు కూడా కాదు. వేరే వాళ్లతో నిర్మించాడు. ప్రజాస్వామ్య దేశంలో నచ్చినట్టు సినిమాలు తీసుకునే హక్కు అందరిదీ. మరో రెండు మూడు యానిమల్స్‌ను సందీప్‌ రెడ్డి తీయమనండి. నాకొచ్చే నష్టమేమీ లేదు’ అంటూ గట్టిగా క్లాస్‌ పీకారు జావేద్‌. మరి దీనిపై కూడా సందీప్‌రెడ్డి స్పందిస్తారేమో!

Updated On 18 March 2024 1:22 AM GMT
Ehatv

Ehatv

Next Story