హీరో రాజ్‌తరుణ్‌(Hero Raj Tarun)-లావణ్య చౌదరి(Lavanya Chowdhary)ల డైలీ సీరియల్‌కు ఎప్పుడు క్లయిమాక్స్‌ స్టేజ్‌కు వస్తుందో ఏమో కానీ ఈ ఎపిసోడ్‌లో రోజుకో ట్విస్ట్ వస్తున్నది.

హీరో రాజ్‌తరుణ్‌(Hero Raj Tarun)-లావణ్య చౌదరి(Lavanya Chowdhary)ల డైలీ సీరియల్‌కు ఎప్పుడు క్లయిమాక్స్‌ స్టేజ్‌కు వస్తుందో ఏమో కానీ ఈ ఎపిసోడ్‌లో రోజుకో ట్విస్ట్ వస్తున్నది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ రాజ్‌ తరున్‌ పై లావణ్య పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అసలే లావణ్య చౌదరితోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాజ్‌తరుణ్‌కు ఇప్పుడు సంయుక్త (Samyuktha)అనే యువతి కంట్లో నలుసుగా మారారు. ఆమె రాజ్‌తరుణ్‌ పేరును ప్రస్తావించకుండా అతడి సినిమాలతో ఆ హీరో మగాడే కాదంటూ ఓ వీడియో పెట్టారు. ఓ నెల రోజుల నుంచి రాజ్‌తరుణ్‌-లావణ్య చౌదరి మధ్య జరుగుతున్న రచ్చను గమనిస్తున్నానని, ఆ హీరో చూడటానికి బాగుంటాడు కానీ అతడికి మ్యాటర్‌ లేదని సంయుక్త చెప్పారు. ఒక మ్యాటర్‌ లేని వ్యక్తి ఇలాంటివి అన్ని చేశాడంటే ఎలా నమ్మడం అని ప్రశ్నించారు. ' నా ఫ్రెండ్‌తో రాజ్‌తరుణ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. అయితే వారిద్దరు రిలేషన్‌లో ఉన్నప్పుడు ఆ పిల్ల రోజూ ఏడుస్తూనే ఉండేది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే తనను ఎప్పుడు దూరం ఉంచుతున్నాడని అని చెప్పింది.

అందుకే చెబుతున్నా రాజ్ త‌రుణ్ సినిమాలో మాత్ర‌మే హీరో బ‌య‌ట జీరో' అని సంయుక్త చెప్పుకొచ్చారు. 'ఏది ఏమైనా స‌రే ఆగ‌ష్టు 19 నా ఫ్రెండ్ ఇండియాకు వ‌స్తుంది. అప్పుడు సాక్ష్యాలతో మీ ముందుకు వ‌స్తాను' అని సంయుక్త తెలిపారు. అయితే ఈ సంయుక్త అనే పేరుతో మాట్లాడిన అమ్మాయి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. స్కార్ఫ్‌ అడ్డం పెట్టుకుని మాట్లాడారు. అయితే ఈ వీడియో ప్ర‌మోష‌న్స్ కోసం చేసిన‌ట్టగా అనిపిస్తోంది. రాజ్ త‌రుణ్ న‌టిస్తున్న తాజా చిత్రం భ‌లే ఉన్నాడే సినిమా ప్ర‌మోష‌న్స్ కోస‌మే ఈ వీడియో చేసిన‌ట్లు తెలుస్తుంది.

ehatv

ehatv

Next Story