మలయాళ కథానాయిక సంయుక్త మీనన్‌(Samyuktha menon) తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కూడా గూడుకట్టుకుంది. నటించిన సినిమాలు తక్కువే ఉన్నా అన్ని విజయవంతమయ్యాయ. వరుస చిత్రాలలో సక్సెస్‌ను అందుకున్న సంయుక్తకు నిజానికి కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చి ఉండాలి. ఆశ్చర్యకరమైన విషయమేమింటే ఆమెకు అలా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు.

మలయాళ కథానాయిక సంయుక్త మీనన్‌(Samyuktha menon) తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కూడా గూడుకట్టుకుంది. నటించిన సినిమాలు తక్కువే ఉన్నా అన్ని విజయవంతమయ్యాయ. వరుస చిత్రాలలో సక్సెస్‌ను అందుకున్న సంయుక్తకు నిజానికి కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వచ్చి ఉండాలి. ఆశ్చర్యకరమైన విషయమేమింటే ఆమెకు అలా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. అలా అని ఆమె ఖాళీగా ఏమీ లేదు. నిస్సహాయులైన మహిళల కోసం ఏదో చేయాలని అనుకుంది. అలా అనుకున్న వెంటనే సేవా మార్గంలోకి వెళ్లిపోయింది. 2016లో పాప్‌కార్న్‌ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. మన తెలుగు సినిమాల విషయానికి వస్తే భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. లాస్టియర్‌ ఆమె నటించిన సర్‌(Sir) సినిమా కూడా ఘన విజయం సాధించింది. అయితే కల్యాణ్ రామ్‌తో కలిసి నటించిన డేవిల్‌(Devil) సినిమా మాత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. డెవిడ్‌తో ఈమె తొలి ఫ్లాప్ ఎదురైంది. సినిమాల గురించి పక్కన పెడితే మొన్న శ్రీరామనవమి పండుగ రోజును ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. మహిళల ఉన్నతి కోసం ఆదిశక్తి పేరుతో ఓ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. ఈ ఫౌండేషన్‌ మహిళలకు అన్ని విధాల సహాయపడుతుందని సంయుక్తా మీనన్‌ అన్నారు. విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం లాంటి విషయాల్లో మహిళలకు ఈ ఆదిశక్తి అండగా నిలబడనుంది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు కాబట్టే ఫౌండేషన్ స్థాపించిందా? లేక కొత్త సినిమా ప్రాజెక్టులు ఏమైనా చేతికి వస్తే దీన్ని వదిలిపెడుతుందా? అన్నది చూడాలి!

Updated On 20 April 2024 6:00 AM GMT
Ehatv

Ehatv

Next Story