మలయాళ నటి సంయుక్త మీనన్‌కు(Samyukta Menon) తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. భీమ్లా నాయక్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంయుక్త తర్వాత బింబిసారలో హీరోయిన్‌గా నటించారు. సర్‌తో ప్రేక్షకులను అలరించారు.

మలయాళ నటి సంయుక్త మీనన్‌కు(Samyukta Menon) తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. భీమ్లా నాయక్‌తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సంయుక్త తర్వాత బింబిసారలో హీరోయిన్‌గా నటించారు. సర్‌తో ప్రేక్షకులను అలరించారు. విరూపాక్షతో మంచి సక్సెస్‌ను అందుకున్నారు. ఇప్పుడు కల్యాణ్‌ రామ్‌(Kalyan Ram) హీరోగా వస్తున్న డేవిల్‌లో(Devil) ముఖ్య భూమికను పోషిస్తున్నారు. ఈ పీరియాడిక్‌ స్పై థ్రిల్లర్‌ సినిమాను స్వీయ దర్శక నిర్మాణంలో అభిషేక్‌ నామా రూపొందిస్తున్నారు. సోమవారం సంయుక్త మీనన్‌ పుట్టిన రోజు.

ఈ సందర్భంగా డెవిల్‌ సినిమాలోని ఆమె ఫస్ట్‌ లుక్‌ను(First Look) విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో ఆమె సంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతున్నది. పూలబుట్టని చేత పట్టుకొని దైవ దర్శనానికి ప్రశాంత వదనంతో వెళుతున్నట్టుగా సంయుక్త కనిపిస్తున్నారు. ఎవరికీ అంతుపట్టని ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌గా కల్యాణ్‌రామ్‌ ఇందులో నటిస్తున్నారు. ఈ పాత్ర ఉత్కంఠను పంచుతుందని దర్శకుడు అభిషేక్‌ నామా అన్నారు. కథానాయిక సంయుక్త మీనన్‌ నైషధ అనే సంప్రదాయ అమ్మాయి పాత్రలో కనిపిస్తారని చెప్పారు.

హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కథ-స్క్రీన్‌ప్లే, మాటలను శ్రీకాంత్‌ విస్సా రాస్తున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్ సిద్దార్థ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం స్వయంభులో కూడా సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంయుక్త మీనన్‌ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా లుక్‌ ఒకటి షేర్ చేశారు మేకర్స్‌.

ఇక నిఖిల్‌ తన కోస్టార్‌ను విష్ చేశారు. మా హీరోయిన్‌ సంయుక్తామీనన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. సుఖ సంతోషాలతో ఆయురోగ్యాలతో ఉండాలని, ఈ ఏడాది మరెన్నో బ్లాక్ బస్టర్‌ హిట్స్ అందుకోవాలని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశాడు. స్వయంభు చిత్రానికి భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. స్వయంభు నిఖీల్‌ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Updated On 12 Sep 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story