టాప్‌ హీరోయిన్‌ సమంత(samantha) దక్షిణాది భాషల్లోనే కాదు, బాలీవుడ్‌లోనూ నటించి సత్తా చాటుకున్నారు. హిందీ బెల్ట్‌లో సమంతకు చాలా మంది అభిమానులున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్‌, సిటాడెల్‌లతో(Citadel) హిందీ ప్రేక్షకులకు ఆమె చాలా దగ్గరయ్యారు. ఇప్పుడు సమంత హాలీవుడ్‌లో నటిస్తున్నారు.

టాప్‌ హీరోయిన్‌ సమంత(samantha) దక్షిణాది భాషల్లోనే కాదు, బాలీవుడ్‌లోనూ నటించి సత్తా చాటుకున్నారు. హిందీ బెల్ట్‌లో సమంతకు చాలా మంది అభిమానులున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్‌, సిటాడెల్‌లతో(Citadel) హిందీ ప్రేక్షకులకు ఆమె చాలా దగ్గరయ్యారు. ఇప్పుడు సమంత హాలీవుడ్‌లో నటిస్తున్నారు. చెన్నై స్టోరీ(chennai Story) పేరుతో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్లోకి వెళ్లనుంది. బాఫ్టా పురస్కారాన్ని గెల్చుకున్న ఫిలిప్‌ జాన్‌(Phillips John) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విల్‌ మచిన్‌(veel Machin) సినిమాను నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత సరసన వివేక్‌ కల్రా(Vivek Kalra) నటించనున్నారు. లండన్‌లో(london) స్థిరపడిన భారతీయ మూలాలున్న ఓ ఇంగ్లీష్‌ యువకుడు నిఖిల్‌ అంటే వివేక్‌ కల్రా తన తల్లి చనిపోయాక తన పూర్వీకుల సమాచారం తెలుసుకోవడానికి, తన తండ్రి జాడను కనిపెట్టేందుకు చెన్నైకు వస్తాడు.

అక్కడ అతనికి అను అంటే సమంత పరిచయం అవుతుంది. నిఖిల్‌ తండ్రిని వెతకడానికి సాయం చేయడానికి అను ఒప్పుకుంటుంది. అను ఓ ప్రైవేట్‌ డిటెక్టివ్‌. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందన్నదే కథలో లీడ్‌ పాయింట్‌. అరేంజ్‌మెంట్స్ ఆఫ్‌ లవ్‌(arrangements Of Love) నవల ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చెన్నై, బ్రిటన్‌లలో సినిమా చిత్రీకరణ ఉంటుంది. హలీవుడ్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటోంది. ఈ సినిమా కోసం సమంత బాగానే హోమ్‌వర్క్‌ చేస్తున్నారు. డిటెక్టివ్‌ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వాళ్ల బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుంది? వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? అన్న విషయాలను తెలుసుకుంటున్నారు. ఇంత హార్డ్‌వర్క్‌ చేస్తారు కాబట్టే సమంత అగ్రశ్రేణి నటి అయ్యారు.

Updated On 31 May 2023 4:22 AM GMT
Ehatv

Ehatv

Next Story