గత కొంతకాలంగా మయోసైటిస్‌(myositis) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్‌ హీరోయిన్‌ సమంత(Samantha) ప్రస్తుతం సినిమాలకు కాసింత విరామం ఇచ్చారు. ఆరోగ్యంపైనే దృష్టి పెట్టారు. తన చికిత్సలో భాగంగా రకరకాల థెరపీలను ప్రయత్నిస్తున్నారు. ఇటవల క్రయోథెరపీ అనే ఆయుర్వేద చికిత్స తీసుకున్న సమంత ప్రస్తుతం భూటాన్‌(Bhutan)లో ఉన్నారు.

గత కొంతకాలంగా మయోసైటిస్‌(myositis) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న స్టార్‌ హీరోయిన్‌ సమంత(Samantha) ప్రస్తుతం సినిమాలకు కాసింత విరామం ఇచ్చారు. ఆరోగ్యంపైనే దృష్టి పెట్టారు. తన చికిత్సలో భాగంగా రకరకాల థెరపీలను ప్రయత్నిస్తున్నారు. ఇటవల క్రయోథెరపీ అనే ఆయుర్వేద చికిత్స(Ayurvedic Treatment) తీసుకున్న సమంత ప్రస్తుతం భూటాన్‌(Bhutan)లో ఉన్నారు. అక్కడ డాట్‌ షో అనే ఆయుర్వేద చికిత్సను తీసుకుంటున్నారు. డాట్‌ షో అంటే హాట్‌ స్టోన్‌ బాత్‌ అన్నమాట. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తూ ఆ ట్రీట్‌మెంట్‌ వల్ల కలిగే ఉపయోగాలను కూడా పంచుకున్నారు. భూటాన్‌లో హాట్‌ స్టోన్‌ బాత్‌ అనే ఆయుర్వేద ట్రీట్‌మెంట్‌ చాలా ప్రసిద్ధం. దీనిపై సమంత స్వయంగా తన పోస్టులో షేర్‌ చేశారు. 'వేల ఏళ్ల క్రితం నుంచే భూటన్‌లో ఈ ఆచారం ఉంది. ఆయుర్వేదలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న భూటాన్‌ ప్రజలు స్టోన్‌ బాత్‌ని ఆచరిస్తున్నారు. నదులలో ఉన్న రాళ్లను బాగా కాలుస్తారు. కాల్చిన రాళ్లను నీటిలో వేస్తారు. రాళ్లల్లో ఉన్న మినరల్స్ కరిగి భూటానీస్‌ హాట్‌ టబ్‌లోకి చేరుతాయి. ఇందులో కెంపా అనే మూలికలు కూడా వాడతారు. ఆ రాళ్లు, మూలికలు వేడి నీటిలో కరిగి వాటి శక్తి నీళ్లకు అందుతాయి. ఆ నీటితో స్నానం చేస్తే మనలో ఉన్న బాడీ పెయిన్స్, అలసట, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, ఎముకల బలహీనత.. ఇలాంటివి అన్ని తొలగిపోతాయి. కండరాలు రిలాక్స్ కావడానికి ఉపయోగపడతాయి' అని చికిత్స విధానాన్ని సమంత వివరించారు. భూటాన్‌లో ఆయుర్వే చికిత్సను తీసుకుంటూనే మరోపక్క అక్కడి ప్రకృతి ప్రదేశాలు, బుద్ధుడి ఆలయాలను సందర్శిస్తున్నారు.

Updated On 9 Nov 2023 1:33 AM GMT
Ehatv

Ehatv

Next Story