విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా వస్తున్న ఖుషి (kushi)సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే కదా! ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం (trailer launch event)ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో సమంత పాల్గొనలేదు. దీనిపై కొందరు అభిమానులు(fans) విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వారికి సమంత ఘాటైన రిప్లై ఇచ్చారు.

kushi
అగ్ర కథానాయిక సమంత(samantha) మిగతా హీరోయిన్ల కంటే చాలా భిన్నం. ఆమె వ్యక్తత్వం చాలా గొప్పది. ఆమెకు ఎదురైన వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇంకెవరికైనా వస్తే పూర్తిగా డీలా పడేవారు. కానీ సమంత మాత్రం వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎవరినీ పల్లెత్తు మాట అనరు. తనపై ఇష్టవచ్చినట్టుగా కామెంట్లు చేస్తున్నా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం సమంతకు కాసింత కోపం వచ్చింది. అది కూడా అర్థపర్థం లేని విమర్శలు చేస్తున్న నెటిజన్ల మీద. నిజానిజాలు తెలియకుండా ఎవరినీ ఓ మాట అనకూడదు. ఎవరి సమస్యలు వారికి ఉంటాయ. అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది. నటి సమంతకు రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. మయోసైటీస్( Myositis) వ్యాధితో బాధపడుతున్న సమంత షూటింగ్‌లను కూడా రద్దు చేసుకుని విదేశాలలో వైద్య చికిత్స తీసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు.
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా వస్తున్న ఖుషి (kushi)సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే కదా! ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం (trailer launch event)ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమంలో సమంత పాల్గొనలేదు. దీనిపై కొందరు అభిమానులు(fans) విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వారికి సమంత ఘాటైన రిప్లై ఇచ్చారు. తన ట్విట్టర్‌లో(twitter) స్ట్రాంగ్‌గా జవాబిస్తూ ట్వీట్(tweet) చేశారు. ‘మీరు ఈ ప్రపంచం కోసం జీవించాల్సిన అవసరం లేదు. మీ గౌరవాన్ని మీరు తెలుసు కోవాలి. మీ స్థాయిని మీరే పెంచుకోవాలి. మీ కోసం మీరు జీవించండి. ఇతరుల కోసం కాదు. మిమ్మల్ని ఈ సమాజం గుర్తించకపోవచ్చు. అయితే మీరు అలా ఉండకూడదు. పదిమందిలో ఒకరిగా కాకుండా మీ కోసం మీరు నిలబడటం అన్నది ఎప్పటికీ మంచిది’ అని ట్వీట్ చేశారు సమంత. ఆమె ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో (social media)వైరల్(viral)అవుతోంది. ఇదిలా ఉంటే ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటవ(september 1) తేదీన విడుదల కానుంది. దీంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమాల్లో (pre-release event)సమంత పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
