Samantha : హేమ రిపోర్టు మాదిరి.. టాలీవుడ్ నివేదికనూ వెల్లడించండి.. టీ సర్కార్‌ను కోరిన సమంత
టాలీవుడ్‌లో మహిళల సమస్యలపై పోరాడేందుకు ఏర్పడిన 'ది వాయిస్ ఆఫ్ ఉమెన్' సమర్పించిన సబ్ కమిటీ నివేదికను వెల్లడించాలని నటి సమంతా రూత్ ప్రభు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
టాలీవుడ్‌లో మహిళల సమస్యలపై పోరాడేందుకు ఏర్పడిన 'ది వాయిస్ ఆఫ్ ఉమెన్' సమర్పించిన సబ్ కమిటీ నివేదికను వెల్లడించాలని నటి సమంతా రూత్ ప్రభు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. హేమ కమిటీ నివేదికను స్వాగతించిన సమంత.. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేరళలోని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యుసిసి) పాత్రను ప్రశంసించారు. అలాగే.. 2019లో స్థాపించబడిన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏర్పాటైన 'ది వాయిస్ ఆఫ్ ఉమెన్ బ్ కమిటీ' నివేదికను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించేందుకు.. పరిశ్రమ విధానాలను రూపొందించడంలో ఈ నివేదిక సహాయపడుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌కమిటీ నివేదిక విడుదల చేయాలని కోరుతూ సమంత ఒక పోస్టు చేసింది. యాంకర్, టాలీవుడ్ నటి ఝాన్సీ కూడా సమంత పోస్ట్‌కు మద్దతు తెలియజేశారు.
హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో లింగ వివక్ష, వేధింపులపై దృష్టి సారించింది. అనేక లైంగిక వేధింపుల ఘటనల తర్వాత 2017లో ఏర్పాటైన జస్టిస్ కె. హేమ నేతృత్వంలోని కమిటీ మహిళల భద్రత, పని వేళల్లో పరిస్థితులపై పరిశోధించింది. నివేదికను డిసెంబర్ 2019లో సమర్పించింది. ఆగస్టు 19, 2024న నివేదిక వివరాలు బయటకురాగా.. మాలీవుడ్ కుదేలవుతంది. తీవ్రమైన లైంగిక వేధింపులు, పురుష, స్త్రీ నటుల మధ్య గణనీయమైన వేతన వ్యత్యాసాలను హేమ కమిటీ నివేదిక వెల్లడించింది. పరిశ్రమలోని శక్తివంతమైన వ్యక్తుల నుండి మహిళలు బెదిరింపులు ఎదుర్కొన్నట్లు గుర్తించింది.