సమంత(Samantha) అద్భుతమైన నటి. ఆమెకు సరైన పాత్ర దొరకాలే కానీ అదరగొట్టేస్తారు. సినిమాల్లోకి వచ్చి సుమారు పదిహేనేళ్లవుతుందేమో. ఈ పదిహేనేళ్ల కాలంలో ఆమె సాధించిన ఘనతలు చాలానే ఉన్నాయి. అనేక భాషల్లో నటిస్తూ తనేమిటో రుజువు చేసుకున్నారు. నటిగా పీక్ స్టేట్‌లో ఉన్న కాలంలోనే నటుడు నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, తర్వాత విడిపోవడం జరిగాయి.
సమంత(Samantha) అద్భుతమైన నటి. ఆమెకు సరైన పాత్ర దొరకాలే కానీ అదరగొట్టేస్తారు. సినిమాల్లోకి వచ్చి సుమారు పదిహేనేళ్లవుతుందేమో. ఈ పదిహేనేళ్ల కాలంలో ఆమె సాధించిన ఘనతలు చాలానే ఉన్నాయి. అనేక భాషల్లో నటిస్తూ తనేమిటో రుజువు చేసుకున్నారు. నటిగా పీక్ స్టేట్‌లో ఉన్న కాలంలోనే నటుడు నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, తర్వాత విడిపోవడం జరిగాయి. కొన్నాళ్ల కిందట తాను మయోసైటిస్(Mayositis) అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నానని సమంత చెప్పడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఆ భయంకరమైన వ్యాధితో పోరాడిన సమంత ఇప్పడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో సమంత నటించిన రెండు మూడు సినిమాలు పెద్దగా ఆడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న చారిత్రక కథా చిత్రం శాకుంతలం(shakunthalam) కూడా ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో సమంత పని అయిపోయిందని ఆమె వ్యతిరేకులు కొందరు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సమంతపై నెగటివ్ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో(social media) విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలను కూడా సమంత చాలా లైట్‌గా తీసుకున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఆమెకు మనోధైర్యం చాలా ఉందన్న విషయం పాపం ఆమె వ్యతిరేకులకు తెలియనట్టుగా ఉంది.
ప్రస్తుతం ఆమె తెలుగులో విజయ్‌దేవరకొండ(Vijay Devarkonda) సరనన ఖుషి(Kushi) అనే సినిమాలో నటిస్తున్నారు. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ సిటాడెల్(Citadel) హిందీ రీమేక్‌లో కూడా నటిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇప్పుడు పాన్ వరల్డ్ నటిగా పేరు సంపాదించుకోబోతున్నారు. త్వరలో ఓ హాలీవుడ్ సినిమాలో నటించనున్నాను. చెన్నైస్టోరీ(Chennai Story) అనే హాలీవుడ్ సినిమాలో నటించడానికి సమంత ఓకే చెప్పారు. ఇంగ్లాండ్‌కు చెందిన హాలీవుడ్ నటుడు వివేక్ కల్రా(Vivek Kalra) ఇందులో హీరో. దీనికి ఫిలిప్ జాన్(Phillip John) దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది ఇంగ్లాండ్‌కు చెందిన యువకుడికి, చైన్నెకు చెందిన అమ్మాయితో జరిగే ప్రేమకథ. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.