టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) చాలా కాలంగా మయోసైటిస్(Mayositis) వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యాధికోసం ఆమె సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ తీసుకుంది. ఇలా విరామం ఇచ్చిన సామ్...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) చాలా కాలంగా మయోసైటిస్(Mayositis) వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యాధికోసం ఆమె సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ తీసుకుంది. ఇలా విరామం ఇచ్చిన సామ్... ప్రస్తుతం అమెరికాలో తన వ్యాధికి సబందించిన ట్రీట్మెంట్ తీసుకుంటోంది. అంతే కాదు ఖాళీ టైమ్ లో లైఫ్ నుఎంజాయ్ చేస్తూ.. టూర్లు వేస్తూ.. హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తోంది. ఇక తన ట్రీట్మెంట్ లో భాగంగా సమంత ప్రస్తుతం క్రయోథెరపీ(Cryotherapy ) చేయించుకుంటోంది.

ఇంతకీ ఏంటీ క్రమో థెరపీ.. దీని వల్ల లాభం ఏంటి..? తెలుసుకుందాం. క్రయోథెరపీ అనేది చాలా కూల్ టెంపరేచర్(Cool Temperature) ద్వారా చేసే ట్రీట్మెంట్. గడ్డకట్టించేంత ఉష్ణోగ్రతలో పేషెంట్లకు చికిత్స చేస్తారు. రోగులు క్రయోజనిక్ టబ్ లో కొన్ని నిమిషాల పాటు ఉండాల్సి ఉంటుంది. దీని వల్ల మయోసైటిస్ వల్ల వచ్చిన కండరాల నొప్పి, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి. మయోసైటిస్ కు ఇది మంచి థెరపీ అని వైద్య నిపుణులు చెపుతారు.

అంతే కాదు మన శరీరంలో అనారోగ్యపూరితమైన కణజాలాన్ని ఈ థెరపీ నాశనం చేస్తుంది. ఈ ట్రీట్మెంట్ ను రకరకాల క్యాన్సర్ల చికిత్సలకు కూడా ఈ నిర్వహిస్తుంటారు. బోన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ప్రారంభ దశలో ఉన్న స్కిన్ క్యాన్సర్ తదితర చికిత్సలకు ఈ థెరపీని చేస్తారు. కొంచె నొప్పిగా ఉన్నా ఈ థెరపీ మంచి ఫలితాలను ఇస్తుందని చెపుతారు.

అత్యంత చల్లదనం వల్ల అనారోగ్య కణజాలం నశిస్తుంది. చర్మం వెలుపల ఉన్న టిష్యూలతో పాటు, శరీరంలోని టిష్యూలను కూడా ఈ థెరపీ ద్వారా ట్రీట్ చేయవచ్చు. ఈ చికిత్సలో అత్యంత చల్లదన్నాన్ని సృష్టించేందుకు లిక్విడ్ నైట్రోజన్, ఆర్గాన్ గ్యాస్ లను వాడతారు. లెవెల్స్ ని బట్టి మైనస్ 85 నుంచి మైనస్ 140 డిగ్రీల సెల్సియస్ వద్ద చికిత్స కొనసాగుతుంది. పేషెంట్ కండిషన్ ను బట్టి లోకల్ అనస్తీషియా లేదా జనరల్ అనస్తీషియాను ఇస్తారు.

Updated On 6 Nov 2023 7:45 AM GMT
Ehatv

Ehatv

Next Story