సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu).. ఈ హీరోయిన్ రకరకాల కారణాలతో ప్రతీసారి వార్తలో నిలుస్తోంది. ఆమె తాజాగా నటించిన మైథాలాజికల్ ప్యాన్ ఇండియా ప్రేమకథ చిత్రమే శాకుంతలం (Shaakuntalam). ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సమంత (Samantha) నార్త్ ఇండియాలో పర్యటిస్తుంది. ముంబైలో జరిగిన ప్రమోషన్స్‌లో సమంత పలు విషయాలు మీడియాతో షేర్ చేసుకుంది.

ఈ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్‌లో యశోద (Yashodha) సినిమా అండ్ అలాగే ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాక తన జీవితం ఎలా మారిందో వివరించింది. సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) సరదాగా తన కుక్కను ఎవరైనా పాన్ ఇండియా స్టార్ అని చెప్పగలరా.. ఎందుకంటే అది రోజు ఇల్లంతా క్లీన్ చేస్తుందంటూ చెప్పుకొచ్చింది.
కెరీర్ పరంగా ఎవరితోనైనా కలిసి పని చేయాలనుకుంటున్నారా, ఏదైనా డ్రీమ్ ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘‘తన కెరీర్లో ఇంత దూరం వరకు వస్తానని కలలో కూడా ఊహించలేద’’ని సమాధానం చెప్పింది. ఇక తాను ప్రస్తుతం చేస్తున్న క్యారెక్టర్స్ తనకు మంచి గుర్తింపు తెస్తున్నాయని.. చాలా ఆనందంగా ఉందని సమంత తెలిపింది. వెబ్ సిరీస్ సిడాటెల్ (Citadel) షూట్లో ప్రతీరోజు చాలా ఉత్సాహంగా ఉంటుందని, ఒక స్త్రీకి యాక్షన్ చేయడం చాలా కష్టమని.. కానీ ఈ సిరీస్‌లో అలాంటి కష్టం లేకుండా చాలా హ్యాపీగా ఉందంటూ.. మరోవైపు ఈ సిరీస్‌తో కొత్త అనుభవాలను ఆస్వాధిస్తున్నానంటూ జెస్సీ చెప్పుకొచ్చింది.
ఇక శాకుంతలం (Shaakuntalam) సినిమాను మహాభారతం (mahabharatham) లోని దుష్యంత, శకుంతల ప్రేమకథ ఆధారంగా వెండితెరపై గుణ శేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో రూపొందుతున్న విజువల్ వండరే ఈ శాకుంతలం సినిమా. ఈ చిత్రాన్ని నీలిమ గుణ, దిల్ రాజు నిర్మిస్తున్నారు. డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా అందిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.