అందానిక అంద, నటనకు నటన.. సోయగాల పూల తోట సమంత. టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుని.. హీరోయిన్ గా వెండితెరపై వెలుగు వెలిగిన బ్యూటీ.. మూడు పదులు దాటి వయస్సు పరుగులు తీస్తున్నా... ఇంకా తనగని అందంతో అలరిస్తోంది. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా..

సమంత(samantha) పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లేత వయస్సులో శామ్ అందాన్ని చూసి ముగ్ధులవుతున్నారు

అందానిక అంద, నటనకు నటన.. సోయగాల పూల తోట సమంత. టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుని.. హీరోయిన్ గా వెండితెరపై వెలుగు వెలిగిన బ్యూటీ.. మూడు పదులు దాటి వయస్సు పరుగులు తీస్తున్నా... ఇంకా తనగని అందంతో అలరిస్తోంది. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది బ్యూటీ.

ఈ నేపథ్యంలోనే టీనేజ్‌ రోజుల్లోని ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) స్టోరీస్‌లో షేర్‌ చేసింది సమంత. 16 ఏళ్ళ ప్రాయంలో.. లేలేత సొగసులు వెన్నెలమాదిరి విరభూస్తుంటే.. బ్లాక్ అండ్ వైట్ అందాలతో అదరహో అనిపిస్తుంది బ్యూటీ. ఈఫోటోను శేర్ చేసిన సమంత ఓ చిన్న క్యాప్షన్ కూడా ఇచ్చింది. నేను 16 ఏళ్ల వయసులో ఉండగా.. అంటూ వెల్లడించింది. ఫొటోలో సామ్‌.. అప్పటికాలంలో ఉన్న ట్రెండీ డ్రస్ లో సోఫాలో కూర్చుని కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది.

సమంత పోటోలకు నెటిజన్లు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. వావ్‌.. సమంత, వరేవ్వా.. సూపర్‌ సామ్‌.., 16 ఏళ్ల వయసులో సామ్‌ ఇలా ఉండేదా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక రీసెంట్ గా సమంత శాకుంతలం (Shaakuntalam) సినిమాతో ప్రేక్షకులను పలకరించింది . కాని ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వీరికి నిరాశనే మిగిల్చింది.ఈ సినిమాత్ సమంత జతగా దేవ్ మోహన్ నటించారు.ఇక ఇప్పుడు సమంత తన నెక్ట్స్‌ హిందీలో సిటడెల్‌ (Citadel) వెబ్‌ సిరీస్‌ షూట్‌లో బిజీగా ఉంది. ఫ్యామిలీ మెన్ ఫేమ్ రాజ్‌-డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధవన్‌ సమంతకు జోడీగా నటిస్తున్నారు.

Updated On 26 April 2023 12:01 AM GMT
Ehatv

Ehatv

Next Story