✕
Samantha Shakuntalam : ‘శాకుంతలం’ రేంజ్ ఎక్కడివరకు..?
By EhatvPublished on 25 March 2023 2:57 AM GMT
మొదటిసారి అనుకుంటా....జర్నలిస్టులను ఆశ్చర్య పరిచిన సంఘటన. ఒక సినిమాకి ఒరిజినల్ గోల్డ్‌తో చేసిన అత్యంత అమూల్యమైన ఆభరణాలను ప్రదర్శించి దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) షాకిచ్చారు. ఓరి నాయనో.... ఏంటా కమిట్మెంట్...ఏంటా పేషన్... అపూర్వం. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా కాలం తర్వాత... ఒక సినిమా కోసం రూ. 14 కోట్ల భారీ ఖర్చుతో నగలు చేయించడం అంటే ఎంత అబ్బురంగా ఉంటుంది? ఇటువంటి సాహసం అందరి వల్లా కాదు.

x
Shakuntalam Samantha
-
- మొదటిసారి అనుకుంటా....జర్నలిస్టులను ఆశ్చర్య పరిచిన సంఘటన. ఒక సినిమాకి ఒరిజినల్ గోల్డ్‌తో చేసిన అత్యంత అమూల్యమైన ఆభరణాలను ప్రదర్శించి దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) షాకిచ్చారు. ఓరి నాయనో.... ఏంటా కమిట్మెంట్...ఏంటా పేషన్... అపూర్వం. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా కాలం తర్వాత... ఒక సినిమా కోసం రూ. 14 కోట్ల భారీ ఖర్చుతో నగలు చేయించడం అంటే ఎంత అబ్బురంగా ఉంటుంది? ఇటువంటి సాహసం అందరి వల్లా కాదు.
-
- సినిమాలలో ఏదీ రియల్ కాదు. రీల్ వరల్డ్‌లో అన్నీ ఇమిటేషనే. కానీ..ఇందులో సైతం సినిమాకి ఒరిజినాలిటీ తీసుకురావాలనే తాపత్రయం, తపన, కసి ఇన్ని కలిస్తే గానీ ఇటువంటి అపురూపమైన పరిణామాలు చోటు చేసుకోనే చేసుకోవు. అది దర్శకుడు గుణశేఖర్‌కి (Gunasekhar) మాత్రమే చెల్లింది. చెల్లుతోంది. ఒక్కడు చిత్రంలో నిర్మాత ఎం. ఎస్. రాజు (M.S.Raju)తో కుస్తీ పట్టి మరీ చార్మినార్ సెట్ వేయించాడు దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar).
-
- ఆ సినిమా ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu) రేంజ్‌ని అమాంతంగా పెంచింది. మహేష్ బాబు మార్కెట్ ఎంత ఉందో కూడా తెలియకుండా నమ్మకంతో గుణశేఖర్ ఆ సాహసానికి పూనుకున్నారు. ఈ మాట మహేష్ బాబు (Mahesh Babu) స్వయంగా విజయవాడలో జరిగిన ఒక్కడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో చెప్పడం విశేషం. తర్వాత అర్జున్ చిత్రానికి మీనాక్షి దేవి ఆలయం భారీ ఎత్తున నిర్మించి సినిమాకి గొప్ప విలువని ఆపాదించారు గుణ. ఇతరులు నిర్మాతలైతే కాదు. తన సొంత ప్రొడక్షన్లో కూడా గుణశేఖర్ కమిట్మెంట్ అంతే. రుద్రమదేవి (Rudhramadevi) ప్రొడక్షన్ వేల్యూస్ చూస్తే కళ్లు తిరుగుతాయి.
-
- మరి తాజాగా ఆయన సుప్రసిద్ధ నిర్మాత దిల్ రాజు (Dil Raju) కుమార్తె హన్షితా రెడ్డి (hanshitha reddy)తో కలిసి గుణటీమ్ పేరుతో సంయుక్తంగా గుణశేఖర్ నిర్మించిన ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రం గుణశేఖర్ కెరీర్లో మరో మైలురాయిగా రూపొందిందన్న వాస్తవాన్ని మొన్నీ మధ్య జరిగిన 14 కోట్ల విలువైన ఒరిజినల్ గోల్డ్ ఆర్నమెంట్స్ చాటిచెబుతున్నాయి.
-
- ఎప్పుడో ఫాకీజా, మొగలీ ఆజమ్ వంటి చిత్రాల గురించి విన్నాం, దర్శకులు ఆసిఫ్, కమల్ అమ్రోహి ఆ చిత్రాలను చిత్రీకరించడానికి పడ్డ అవస్థలు, దాటిన గండాలు వింటుంటే...అవన్నీ గుణశేఖర్‌కి అక్షరాల వర్తిస్తాయని ఒప్పుకోక తప్పదు. కాకపోతే గుణశేఖర్ చిత్రీకరణ సౌందర్యానికి దిల్ రాజు (Dil Raju) లాంటి గోల్డెన్ హేండ్ తోడవ్వడం, ఆయన లాగే మేకింగ్ వేల్యూస్‌లో రాజీలేని ధోరణిని పుణికిపుచ్చుకున్న అన్షితా రెడ్డి ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రంలో భాగస్వామి కావడం ఈ సందర్భంలో కలిసొచ్చిన అంశాలు.
-
- ఈ తరానికి గుణశేఖరే ఒక కమల్ అమ్రోహి, ఒక అసిఫ్. రొటీన్ చిత్రాలను తెరకెక్కించడంలో పూర్తి వైఫల్యాన్ని స్వయంగా స్వీకరించిన దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ (Shaakuntalam) చిత్రాన్ని అజరామరం చేయడానికి అన్ని రకాల రిస్క్‌లకు సిద్దపడి మరీ రూపొందించారు. కానీ ఇటీవల ప్రేక్షకుల దృక్పథంలో కూడా పెను మార్పులు వచ్చాయి. రెగ్యులర్ మూస చిత్రాలను దగ్గరికి రానివ్వడం లేదు.
-
- కరోనా పుణ్యమా అని, ప్రపంచస్థాయి చిత్రాలన్నిటినీ తీరిగ్గా ఇంట్లో కూర్చుని చూసేసిన తెలుగు ప్రేక్షకలోకం కొత్తని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. స్పిల్ బర్గ్ (Steven Spielberg), జేమ్స్ కేమరూన్ (James Cameron) లాంటి హాలీవుడ్ దర్శకులు సైతం ఇండియన మైథాలజీనే బేస్‌గా చేసుకుని తమ సినిమాలను తీర్చి దిద్దుతున్నామని బాహాటంగా చెప్పుకుంటున్న టైమ్ ఇది. ఈ సమయానికి గుణశేఖర్ చేసిన ‘శాకుంతలం’ (Shaakuntalam) అనే దృశ్యకావ్య సాహసం ఎంతో అభినందనీయం.
-
- తెలుగు సినిమాలకు మొన్నీ మధ్య లభించిన ఆస్కార్ అవార్డు (Oscar)తో ప్రపంచద్వారాలు తెరుచుకున్నాయి. ప్రతీ ఫ్రేమ్‌ని మహాశిల్పి జక్కన్న (S.S.Rajamouli) చెక్కినట్టుగా కడు ఓపికతో చెక్కే దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) చేతిలో తయారైన ఈ అందమైన దృశ్యరూపక మహాకావ్యం మరో అద్భుత ప్రపంచ సింహద్వారాలను తెరవడం ఖాయం.
-
- ఇటువంటి భారీ పౌరాణికి చిత్రాల నిర్మాణానికి ఆద్యుడు, అసాధ్యుడుగా ప్రపంచవ్యాప్తంగా పేరు పడ్డ ఎన్టీఆర్ (NTR) పేరును పదే పదే తలుచుకుని మరీ, ఆయనకు అంజలి ఘటిస్తూ నిర్మించి, దర్శకత్వం వహించిన గుణశేఖర్ (Gunasekhar)కి ఆ మహనీయుడి అశీర్వచనాలు నిండుగా,మెండుగా లభిస్తాయని ఆశిద్దాం.

Ehatv
Next Story