స్టార్‌ హీరోయిన్‌ సమంత(Samantha) నిజంగానే ధీర వనిత. జీవితంలో సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టినా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. ఎదురొడ్డి పోరాడారు. కొంతకాలంగా ఆమె అరుదైన మయోసైటిస్‌(Mayositisys) వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్స కోసమే ఆమె కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు.

స్టార్‌ హీరోయిన్‌ సమంత(Samantha) నిజంగానే ధీర వనిత. జీవితంలో సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టినా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. ఎదురొడ్డి పోరాడారు. కొంతకాలంగా ఆమె అరుదైన మయోసైటిస్‌(Mayositisys) వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్స కోసమే ఆమె కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి పెట్టారు. భూటాన్‌లో(Butan) ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. అక్కడ డాట్‌షో (Hot stone bath) అనే ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు.

లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు. ఒకేసారి తనను మూడు పెద్ద సమస్యలు చుట్టుముట్టాయని తెలిపారు. వైవాహిక జీవితం సాఫీగా సాగకకపోవడంతో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, అదే సమయంలో తన సినిమాలు వరుసగా పరాజయాలను చవి చూశాయని, ఆ ఆవేదనలో ఉన్న తనను అనారోగ్యం తీవ్రంగా బాధించిందని సమంత తెలిపారు. ఒకేసారి ఇవన్నీ తన జీవితంలో చుట్టుముట్టడంతో ఎంతో కుంగిపోయానని అన్నారు. గత రెండేళ్లుగా జీవితంలో ఎంతో కుంగిపోయానని, ఆ సమయంలో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని తిరిగి నిలదొక్కుకున్న నటుల గురించి చదివానని సమంత పేర్కొన్నారు.

'జీవితంలో ట్రోలింగ్ ఎదురైనప్పుడు వారు ఎలా నిలబడ్డారో తెలుసుకున్నాను. అలా వాళ్ల గురించి తెలుసుకోవడం నాకెంతో ఉపకరించింది. ఆందోళన నుంచి వారు ఎలా బయటపడ్డారో తెలుసుకున్నాను. వారి జీవిత కథలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ప్రజలు అలా చేస్తే, నేను కూడా చేయగలనని తెలుసుకోవడం నాకు బలాన్ని ఇచ్చింది. వారు చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలననే ధైర్యం వచ్చింది.

అదే నాకు బలాన్నిచ్చింది' అని సమంత వివరించారు. దేశంలో ఎంతో మంది స్టార్స్‌ ఉన్నారని, అయితే వారందరితో పాటు తనకు కూడా గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తానని అన్నారు. ఒక నటిగా తన కర్తవ్యాన్ని తాను ఎంతో నిజాయితీగా నిర్వర్తిస్తున్నానని చెప్పారు. నటీనటుల జీవితాల్లో సినిమాలు, అవార్డులు, వారు వేసుకునే దుస్తువులే కాదని, వారికి కూడా కష్టాలతో పాటు ఎన్నో బాధలు ఉంటాయని సమంత తెలిపారు. ఇక్కడ తనలాగే ఇబ్బందులు పడే వారు ఎందరో ఉన్నారని, వారందరూ కూడా తనలాగే పోరాడాలని ఆశిస్తున్నానని సమంత పేర్కొన్నారు.

Updated On 9 Nov 2023 4:27 AM GMT
Ehatv

Ehatv

Next Story