సమంత(Samantha) మరోసారి నోరు విప్పారు. సోషల్‌ మీడియాలో(Social media) యాక్టివ్‌గా ఉండే ఫ్యాన్స్‌కు ఆమె సమాధానాలిస్తుంటారు. తాజాగా సమంత మరోసారి తన అభిమానులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. తన వివాహ జీవితం గురించి పరోక్షంగా మాట్లాడుతూ తన జీవితంలో పెద్ద తప్పు చేశానన్నారు. తన ఇష్టాఇష్టాలను గుర్తించడంలేదనే విషయాన్ని లేట్‌గా తెలుసుకున్నాన్న ఆమె.

సమంత(Samantha) మరోసారి నోరు విప్పారు. సోషల్‌ మీడియాలో(Social media) యాక్టివ్‌గా ఉండే ఫ్యాన్స్‌కు ఆమె సమాధానాలిస్తుంటారు. తాజాగా సమంత మరోసారి తన అభిమానులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. తన వివాహ జీవితం గురించి పరోక్షంగా మాట్లాడుతూ తన జీవితంలో పెద్ద తప్పు చేశానన్నారు. తన ఇష్టాఇష్టాలను గుర్తించడంలేదనే విషయాన్ని లేట్‌గా తెలుసుకున్నాన్న ఆమె.. తన మాజీ భాగస్వామి ఇష్టాఇష్టాలను ప్రభావితం చేశారని చెప్పారు. అంతేకాకుండా వాటి నుంచి బయటపడ్డానని.. ఇప్పుడే తన కెరీర్‌ పీక్‌లో ఉంటుందని సమంత చెప్పుకొచ్చారు.

గతంలోనూ సమంత మీడియాతో మాట్లాడుతూ విడాకులు(Divorce), వరుస ఫ్లాపులే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడాయని ఆమె అన్నారు. దీంతో తను మానసికంగా కుంగిపోయానన్నారు. ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. మయోసైటిస్‌(Myositis) చికిత్స కోసం
సమంత సినిమాలకు గ్యాప్‌ ఇచ్చారు. ఆమె నటించిన సిటాడెల్‌(Citadel) వెబ్‌సిరీస్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా సమంత నిర్మాతగా కూడా మారుతున్నారు. ఇటీవలే ఓ నిర్మాణ సంస్థను ఆమె ప్రారంభించారు. ఎంతోమంది ప్రతిభ కలిగినవారు వెలుగులోకి రావాలనేది తన కోరిక అనేది సమంత చెప్పుకున్నారు.

Updated On 18 Jan 2024 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story