శాకుంతలం(Shaakuntalam) సినిమా రిలీజ్‌ డేట్‌(movie Release Date) దగ్గరపడుతున్న కొద్దీ ఆ మూవీపై క్యూరియాసిటీ పెరుగుతోంది. కారణం సమంత(Samantha) ప్రధానపాత్రలో నటించడమే! గుణశేఖర్‌(Gunasekhar) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శాకుంతలం(Shaakuntalam) సినిమా రిలీజ్‌ డేట్‌(movie Release Date) దగ్గరపడుతున్న కొద్దీ ఆ మూవీపై క్యూరియాసిటీ పెరుగుతోంది. కారణం సమంత(Samantha) ప్రధానపాత్రలో నటించడమే! గుణశేఖర్‌(Gunasekhar) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తుండటంతో మూవీ మేకర్స్‌ ప్రమోషన్స్‌ను పెంచారు. ఈ సినిమా కోసం సుమారు 14 కోట్ల రూపాయల విలువ చేసే నిజమైన బంగారు నగలు, వజ్రాభరణాలు ఉపయోగించారట! మహానటుడు ఎన్టీఆర్‌ తన దానవీరశూర కర్ణ సినిమాలో బంగారు కిరీటం వాడారట! ఆ స్ఫూర్తితోనే తాను హీరో, హీరోయిన్లకు బంగారు ఆభరణాలు(Gold Jewellery) వాడినట్టు దర్శకుడు గుణశేఖర్‌ తెలిపారు. సినిమా వచ్చే నెల 14న విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రంలో శకుంతల, దుష్యుంతుడు ధరించిన బంగారు, వజ్రాభరణాల ఫొటోలను హైదరాబాద్ లోని వసుంధర జ్యుయెలరీస్ లో ఆవిష్కరించారు.

శాకుంతలం సినిమా కోసం వసుంధర జ్యుయెలరీస్‌ చాలా కష్టపడింది. ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారథ్యంలోని టీమ్‌ సుమారు 6 నుంచి 7 నెలలు శ్రమించి ఆభరణాలు తయారు చేసింది. ఇవన్నీ పూర్తిగా చేతితో తయారుచేసినవే కావడం విశేషం. శకుంతల పాత్ర కోసం 15 కిలోల బంగారంతో సుమారు 14 రకాల ఆభరణాలను తయారు చేశారట. ఇక దుష్యంత మహారాజు కోసం ఎనిమిది నుంచి పది కిలోల బంగారంతో ఆభరణాలు తయారు చేశారట. మేనక పాత్రధారి మధుబాల కోసం ఆరు కోట్ల రూపాయలతో వజ్రాలు పొదిగిన దుస్తులను తయారుచేశారట!

Updated On 23 March 2023 5:26 AM GMT
Ehatv

Ehatv

Next Story