బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో సౌత్‌ ఇండియాకు చెందిన హీరోయిన్ల డామినేషనే ఉంటూ వస్తోంది. ఈ మధ్య హవా తగ్గింది కానీ వైజయంతిమాల మొదలుకొని పద్మిని, హేమామాలిని, రేఖ, వహెదా రెహమాన్‌, జయప్రద, శ్రీదేవి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉంటారు. హిందీ సినీ రంగంలో ఒకరిని మించి మరొకరు నటీమణులు ఉన్నప్పటికీ సౌత్‌ ఇండియాకు చెందిన హీరోయిన్లు తరచూ అదిరిపోయే అవకాశాల్ని సొంతం చేసుకొంటున్నారు.

బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో సౌత్‌ ఇండియాకు చెందిన హీరోయిన్ల డామినేషనే ఉంటూ వస్తోంది. ఈ మధ్య హవా తగ్గింది కానీ వైజయంతిమాల మొదలుకొని పద్మిని, హేమామాలిని, రేఖ, వహెదా రెహమాన్‌, జయప్రద, శ్రీదేవి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉంటారు. హిందీ సినీ రంగంలో ఒకరిని మించి మరొకరు నటీమణులు ఉన్నప్పటికీ సౌత్‌ ఇండియాకు చెందిన హీరోయిన్లు తరచూ అదిరిపోయే అవకాశాల్ని సొంతం చేసుకొంటున్నారు. ఇటీవలే షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan) హీరోగా వచ్చిన జవాన్‌ సినిమాలో నయనతార(Nayanthara) కథానాయిక పాత్రను పోషించి పలువురి ప్రశంసలను అందుకున్నారు. అలాగే రష్మిక కూడా అక్కడ అవకాశాలను సొంతం చేసుకుంటూనే ఉన్నారు. ఇక ఇప్పుడు సమంత(Samantha) వంతు వచ్చింది. ఆమె కూడా బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. సల్మాన్‌ఖాన్‌(Salmaan Khan) కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలో సమంత నటిస్తుందనే ప్రచారమే ఆ చర్చకి కారణం. విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అందులో దక్షిణాది హీరోయినే తనకి జోడీగా నటించాలనేది సల్మాన్‌ నిర్ణయమట! ఆ మేరకు సమంత పేరు ప్రచారంలోకి వచ్చింది. అంతకుముందు త్రిష(Trisha) పేరు కూడా వినిపించింది. మరి అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

Updated On 16 Sep 2023 1:42 AM GMT
Ehatv

Ehatv

Next Story