✕
Shaakuntalam Movie : గుణశేఖర్ చెక్కిన దృశ్యరూపక, అపూర్వశిల్పం శాకుంతలం..!
By EhatvPublished on 14 April 2023 12:34 AM GMT
అత్యంత ఆదరణ పొందిన ఒక పురాణ ఇతిహాసాన్ని తెరకెక్కించడం కన్నా సాహసం మరొకటి లేదు. .అది కూడా అంత నేత్రపర్వంగా, ఎమోషనల్ మూడ్ ఎక్కడా వీక్ అవకుండా మొదటి ఫ్రేం నుంచి చివరి ఫ్రేం వరకూ కూడా ఆద్యంతం రక్తి కట్టించడం మరింత కత్తి మీద సాము. ఈ సాముని దర్శకుడు గుణశేఖర్ (GunaseKhar) అత్యద్భుతంగా నెరవేర్చాడు. శాకుంతలం చిత్రం భారతీయ సంస్కృతీవైభవానికి, పురాతన సాహిత్య సౌరభాలకు తిరుగులేని ప్రతిబింబం. అటువంటి సన్నటి కథాంశాన్ని తీసుకుని, అందులోని పరిమితమైన పాత్రలతో, లోతైన అనుభూతిని, ఎత్తైన ఔన్నత్యాన్ని సప్తవర్ణ దృశ్యకావ్యంగా మలచి, మెప్పించిన దర్శకుడు గుణశేఖర్‌కి నిజంగా హ్యాట్సాఫ్.

x
Shaakuntalam Review
-
- అత్యంత ఆదరణ పొందిన ఒక పురాణ ఇతిహాసాన్ని తెరకెక్కించడం కన్నా సాహసం మరొకటి లేదు. .అది కూడా అంత నేత్రపర్వంగా, ఎమోషనల్ మూడ్ ఎక్కడా వీక్ అవకుండా మొదటి ఫ్రేం నుంచి చివరి ఫ్రేం వరకూ కూడా ఆద్యంతం రక్తి కట్టించడం మరింత కత్తి మీద సాము. ఈ సాముని దర్శకుడు గుణశేఖర్ (GunaseKhar) అత్యద్భుతంగా నెరవేర్చాడు. శాకుంతలం చిత్రం భారతీయ సంస్కృతీవైభవానికి, పురాతన సాహిత్య సౌరభాలకు తిరుగులేని ప్రతిబింబం. అటువంటి సన్నటి కథాంశాన్ని తీసుకుని, అందులోని పరిమితమైన పాత్రలతో, లోతైన అనుభూతిని, ఎత్తైన ఔన్నత్యాన్ని సప్తవర్ణ దృశ్యకావ్యంగా మలచి, మెప్పించిన దర్శకుడు గుణశేఖర్‌కి నిజంగా హ్యాట్సాఫ్.
-
- శాకుంతలం ఇతివృత్తం తర్వాత రోజులలో జరిగిన భారతకథకి మూలంగా, ఆధారికకగా ఆదిపర్వంలో వ్యాసభగవానుడు రసవత్తరంగా, ప్రేమకథాప్రాయంగా, అందులో ఓ ఉంగరాన్ని కూడా ఓ పాత్రగా మలచి చేసిన వైచిత్రి నిజానికి భారత కథకి చిన్నపాటి ప్రవేశిక మాత్రమే. ఇందులోని అజరామరమైన ప్రేమకధాంశానికి, భారతస్త్రీకి జరిగిన ఆవేదనాపూర్వకమైన సంఘటనలకు ప్రభావితమై కొందరు ఉద్దండులే ఆ కథాంశాన్ని తలకెత్తుకుని, చిత్రరూపాన్ని కల్పించడానికి అన్ని విధాల ప్రయత్నించారు. కానీ గుణశేఖర్ చేసిన ఫీట్ మాత్రం ఎనలేనిది. అసామాన్యమైనది. ఆయన శాకుంతలం కథని తెరకెక్కించడానికి పూనకున్న ప్రయత్నశైలి మాత్రం అపూర్వమైనడిగా ఒప్పుకోకతప్పదు.
-
- శాకుంతలం (Shaakuntalam) చిత్రంలోని సౌందర్యాన్ని, హృదయపూర్వక అనుభూతిని ప్రేక్షకుడి గుండెల్లోకి నిలువునా చొప్పించడానికి అత్యంత భారీ ఖర్చుతో గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్ని ఆశ్రయించి, ప్రతీ ఫ్రేంని కళ్ళను కలలతో నింపే విధంగా అపురూపమైన రీతిలో చిత్రీకరించడానికి గుణశేఖర్ (Gunasekhar) ప్రదర్శించిన అంకితభావం, కృషి, దీక్ష మాత్రం భారతీయ చిత్రప్రపంచం ఎప్పటికీ మరచిపోలేదు. తనకున్న ఆపారమైన అనుభవం, సాంకేతిక నైపుణ్యం పట్ల ఆయనకున్న అంతులేని అవగాహన, ఖర్చుకు వెనుకాడని ధైర్యం ఇవన్నీ శాకుంతలం చిత్రానికి ప్రాణం పోసాయి.
-
- తన స్టైల్ కాకపోయినా, తన ట్రెండ్ కాకపోయినా సరే పురాణపాత్రగా యుగాలుగా భారతీయులందరిలోనే కాదు, ప్రపంచదేశాలలో సైతం అమోఘమైన ప్రాచుర్యాన్ని, గుర్తింపును పొందిన శకుంతలం పాత్రను సమంత అభినయించడానికి గ్యారెంటీగా అభినందనీయం. పాత్రను అభినయించడానికి, అందులో ఒదిగిపోవడానికి చేసిన ప్రయత్నంతో శకుంతల పాత్రకు సమంత తనదైన స్థాయిలో ప్రాణం పోసింది. కష్టమే. ఈ తరం హీరోయిన్లు అటవంటి ఆవేదనాభరితమైన పాత్రను పోషించడమంటే మాటలు కాదు. ఓ రకంగా చెప్పాలంటే సమంత ఆదృష్టం ఇటువంటి పాత్ర లభించడం. ఆ ఆదృష్టం ఓపికైన దర్శకుడు గుణశేఖర్ రూపంలో సమంత (Samantha Ruth Prabhu)ను ఆదుకుంది.
-
- కొత్త కుర్రాడైనా దేవ్ మోహన్(Dev Mohan) చాలా మెచ్యూరిటీని చూపించి, దుష్యంతుడి పాత్రలో ఇమిడిపోయాడు.సన్నివేశానికి అనుగుణంగా లీనమై చేశాడు. లోగడ గుణశేఖర్ (GunaseKhar) స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అనుష్క స్టారర్ రుద్రమ దేవి చిత్రానికి అల్లు అర్జున్ కమర్షియల్ పరిరక్షణను కల్పిస్తే, శాకుంతలం చిత్రంలో అల్లు అర్జున్ గారాలపట్టి ఆర్హ ఆ స్థానాన్ని శాకుంతలం చిత్రంలో భర్తీ చేసింది. అల్లువారి వంశాంకురం కదా...డైలాగులు అదరగొట్టేసింది. ఆ చిన్నవయసులో దర్శకుడు చెప్పింది బెరుకు, భయం లేకుండా కెమెరా ముందు నటించి ఆశ్చర్యచకితుల్ని చేసేసింది ప్రేక్షకుల్ని. దానాదీనా, శాకంఉతలం చిత్రానికి ఇద్దరే ఇద్దరు ప్రాణసూత్రాలు. ఒకటి గుణశేఖర్. రెండు సమంత. ఇద్దరూ కలసికట్టుగా చిత్రాన్ని ఒక స్థాయిలో నిలబెట్టారు. నాగేంద్రకుమార్

Ehatv
Next Story