టాలీవుడ్ స్టార్ హీరోయిన్(Tollywood Star Heroine) సమంత(Samantha)కు నెటిజన్ షాక్ ఇచ్చారు. కాస్త ఇబ్బంది కలిగించే ప్రశ్నతో పాటు.. ఓ సలహా కూడా ఇచ్చారు. ఇంతకి సమంతను అడిగిన షాకింగ్ క్వశ్చన్ ఏంటీ..? షాకింగ్ అడ్వైజ్ ఏంటీ..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్(Tollywood Star Heroine) సమంత(Samantha)కు నెటిజన్ షాక్ ఇచ్చారు. కాస్త ఇబ్బంది కలిగించే ప్రశ్నతో పాటు.. ఓ సలహా కూడా ఇచ్చారు. ఇంతకి సమంతను అడిగిన షాకింగ్ క్వశ్చన్ ఏంటీ..? షాకింగ్ అడ్వైజ్ ఏంటీ..?

టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ గా దూసుకుపోతోంది ప్రముఖ నటి సమంత. అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya)తో విడాకులు తీసుకున్నశ్యామ్.. ప్రస్తుతం ఒంటరిగా లైఫ్ ను లీడ్ చేస్తోంది. సినిమాలు.. టూర్లు.. సోషల్ మీడియా ఇదే లైఫ్ గా బ్రతుకుతోంది సమంత. దాంతో ఆమె అభిమానులు కూడా సమంత ఇలా అయిపోయిందేమిటీ అనుకుంటూ బాధపడుతున్నారు. ఇక ఈ బాధను భరించలేక ఓ అభిమాని ఆవేదనతో సమంతకు ఓ సలహా ఇచ్చారు. ఆ సూచన ప్రస్తుతం అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసింది.

ఈ నెల 26న స్రవంతి సీఎం అనే ట్విట్టర్ యూజర్ సమంతకు అనుకోని విధంగా ఓ సూచన చేసింది. మీకు సలహా ఇవ్వడానికి నాకు అర్హత ఉందో లేదో తెలియదు.. ఇది నా స్థానం కాదని తెలుసు. కానీ చెపుతున్నాను.. దయచేసి ఎవరితో అయినా డేట్ చేయండి అంటూ ట్వీట్ చేసింది. కానీ, దీనికి సమంత ఇచ్చిన బదులు అందరి హృదయాలను గెలుచుకుంది. సమంత ఒంటరిగా లైఫ్ లీడ్ చేస్తుంటేు చూడలేక ఈ సలహా ఇచ్చింది అభిమాని.

ఇక ఆ అభిమాని బాధను అర్ధం చేసుకున్న సమంత ఈ విధంగా రిప్లై ఇచ్చింది. మీ అంతలా నన్ను ఎవరు ప్రేమిస్తారు.. అని సమంత బదులిచ్చింది. సమంత సమాధానం చాలా మంది హృదయాలను గెలుచుకుంది. అటు సమంత ఫ్యాన్స్ కూడా ఎవరికి తోచినట్టు వారు స్పందిస్తున్నారు. హాయ్ సమంత ఈ ప్రపంచంలో అన్నింటికంటే నేను నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు.

ఇక సమంత డివోర్స్ తరువాత సినిమాలమీదనే ఎక్కువగా దృష్టి పెట్టింది. వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీగా గడిపేస్తోంది. షూటింగ్స్ లేకుంటే.. తనకు ఇష్టమైన ప్లేస్ లకు వెళ్లి గడిపేస్తుంటుంది బ్యూటీ. ఇక ఆమె సినిమాల విషయానిక వస్తే.. గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలంఏప్రిల్ 14 రిలీజ్ కాబోతోంది. దీనితో పాటు విజయ్ దేవరకొండ జోడీగా ఖుషీ సినిమాలో నటిస్తోంది బ్యూటీ. శివనిర్వాణ డైరెక్ట్ చేసిన ఈసినిమా వచ్చే సెప్టెంబర్ 1కి ఇది విడుదల కావచ్చని సమాచారం.

Updated On 27 March 2023 7:01 AM GMT
Ehatv

Ehatv

Next Story