✕
Samantha Ruth Prabhu : నిజమైన ప్రేమ తెలిసినవాళ్లు అలా చేయరని.. కన్నీరు పెట్టుకున్న సమంత.. !
By EhatvPublished on 4 April 2023 2:12 AM GMT
సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)నే. ఈమె రీసెంట్గా మయోసైటిస్ (Myositis)సమస్యతో పోరాడి ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది. అటు వెబ్ సిరీస్ (web series)లు, ఇటు సినిమా (cinema)లు చేస్తూనే.. పబ్లిసిటీ తోపాటు రాబోయే ప్రాజెక్టులకు కూడా సైన్ చేస్తోంది.

x
Samantha Ruth Prabhu
-
- సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu)నే. ఈమె రీసెంట్గా మయోసైటిస్ (Myositis)సమస్యతో పోరాడి ప్రస్తుతం పూర్తిగా కోలుకుంది. అటు వెబ్ సిరీస్ (web series)లు, ఇటు సినిమా (cinema)లు చేస్తూనే.. పబ్లిసిటీ తోపాటు రాబోయే ప్రాజెక్టులకు కూడా సైన్ చేస్తోంది.
-
- ఫిట్నెస్ ఫ్రీక్ అయిన సమంత (Samantha).. ఎంత పెద్ద బరువులను అయినా సరే అమాంతంగా ఎత్తేస్తుంది. ఈమె జిమ్ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఆమె ఇంట్లో చేసుకుంటున్న వర్కౌట్లు బాగా వైరల్ అవుతుంటాయి. మరోవైపు తన ఫాన్స్ ఇంకా ఫాలోవర్స్‌కి గోల్స్ కూడా ఇస్తుంటుంది ఈ జెస్సీ(Jessy).
-
- ప్రస్తుతం గుణ శేఖర్ (Gunasekhar) డైరెక్షన్లో వస్తున్న శాకుంతలం (Shaakuntalam) సినిమాలో నటిస్తుంది సమంత. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని.. రిలీజ్‌కి దగ్గర పడింది. అందుకు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాల్లోనూ శామ్ పార్టిసిపేట్ చేస్తుంది. ఈ సినిమా ఈ నెల 14న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. సమంత (Samantha) నటించిన ఈ సినిమా మరో పాన్ ఇండియా చిత్రంగా చెప్పుకోవచ్చు.
-
- ఆనారోగ్యం నుంచి కోలుకుని పూర్తి స్వింగ్‌లో ఉన్న ఆమె శాకుంతలం (Shaakuntalam) చిత్రం ప్రమోషన్స్ కోసం టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు, డైలీ న్యూస్‌లు వంటి వాటిలో బ్యాక్ టూ బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సినిమా అన్ని వర్గాల వారితోపాటు ముఖ్యంగా చిన్న పిల్లలను ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుందని, ఈ సమ్మర్లో ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అని సమంత (Samantha)చెప్తోంది.
-
- శాకుంతలం (Shaakuntalam) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలువురు నటి నటులతో కలిసి సమంత (Samantha) తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు పర్సనల్ లైఫ్ గురించి అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తోంది. తన మాజీ భర్త నాగ చైతన్య (Naga Chaitanya) శోభిత ధూళిపాళ్ల ( Sobhita Dhulipala)తో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుండగా, ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నించగా ఆమె ఇలా చెప్పుకొచ్చింది.
-
- "ఎవరు రిలేషన్షిప్లో ఉన్నా.. ఎవరితో రిలేషన్షిప్ ఉన్నా.. నేను పట్టించుకోవడం లేదు.. బాధపడటం లేదు" అని చెప్పుకొచ్చింది. ప్రేమ విలువలు తెలియని వాళ్ళు ఎంత మందితో డేటింగ్ చేసినా ఏం ఉపయోగం అంటూ సమంత (Samantha) కన్నీటి పర్యాంతమైంది. అతను తన ప్రవర్తన మార్చుకుని ఆ అమ్మాయినైనా బాధ పెట్టకుండా చూసుకుంటే అందరికీ మంచిదే కదా అని చెప్పింది.
-
- ఇక సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం సిడాటెల్ అనే వెబ్ సిరిస్‌లో నటిస్తోంది. అండ్ అలాగే విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'కుషి'లో నటిస్తోంది.. ఇక బాలీవుడ్లో వరుణ్ ధావన్‌తో సిడాటెల్లో నటిస్తోంది సమంత.

Ehatv
Next Story