టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత(Samantha)- హీరో అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) జోడి బాగుండింది. వారిద్దరు టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందో కానీ విడాకులు పుచ్చుకున్నారు. విడిపోయి చాలా రోజులే అవుతుంది. అయినా ఇప్పటికీ వీరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంది. ఇలాంటి వదంతులను అటు సమంత కానీ, ఇటు నాగచైతన్య కానీ పట్టించుకోవడం లేదనుకోండి.

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత(Samantha)- హీరో అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) జోడి బాగుండింది. వారిద్దరు టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరి మధ్య ఎక్కడ చెడిందో కానీ విడాకులు పుచ్చుకున్నారు. విడిపోయి చాలా రోజులే అవుతుంది. అయినా ఇప్పటికీ వీరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంది. ఇలాంటి వదంతులను అటు సమంత కానీ, ఇటు నాగచైతన్య కానీ పట్టించుకోవడం లేదనుకోండి. తమ కెరీర్‌పైనే వారిద్దరు దృష్టి పెట్టారు. సినిమాలకు కొంత విరామాన్ని ప్రకటించిన సమంత ప్రస్తుతం దుబాయ్‌ వెకేషన్‌లో(Dubai Vacation) ఎంజాయ్‌ చేస్తున్నారు. మొన్నటి వరకు అమెరికా టూర్‌ను ఎంజాయ్‌ చేసిన సమంత ఇప్పుడు దుబాయ్‌ అందాలను చూసేందుకు సిద్ధమయ్యారు. కొంతకాలం ఇలా విహార యాత్రలు చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యమూ కుదుటపడుతుందన్నది సమంత భావన కావచ్చు. ఈ నేపథ్యంలో సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. తన మాజీ భర్త నాగ చైతన్య కోసం వేయించుకున్న టాటూను(Tatoo) సమంత తొలగించుకున్నారన్నదే ఆ వార్త!
సమంత-నాగ చైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే! నాగ చైతన్యపై తనకున్న ప్రేమకు గుర్తుగా సమంత మూడు టాటూలను వేయించుకుననారు. ఒకటేమో చేతి మణికట్టు దగ్గర, మరోటేమో మెడ వెనుక, ఇంకోటి నడుముపైన. విడాకులు తీసుకున్న తర్వాత ఈ పచ్చబొట్ల విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. టాటూలను సమంత చెరిపేస్తారా లేదా అన్నదానిపై సోషల్‌ మీడియాలో(Social Media) పెద్ద చర్చే జరిగింది. విడాకుల తర్వాత సమంత తన శరీరంపై టాటూలను అలానే ఉంచుకుంది. అప్పట్లో సమంత చేసిన ఫోటో షూట్స్‌లో నడుము పైన ఉన్న టాటూపై నెటిజన్లు తలోరకంగా కామెంట్‌ చేశారు. భర్తకు దూరమైనా.. అతని ముద్దు పేరు మాత్రం వదిలించుకోవడం లేదని అన్నారు. అయితే తాజాగా సమంత పింక్‌ సారీలో ఫోటోషూట్‌ నిర్వహించారు. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకున్నారు. ఆ ఫోటోలను జాగ్రత్తగా పరీశీలిస్తే నడుముపై చై టాటూ మిస్‌ అయినట్టు కనిపిస్తోంది. దీంతో సమంత ఆ టాటూని తొలగించుకున్నారని కొందరంటున్నారు. టాటుని తొలగించుకోవడం కష్టమని, మేకప్‌ వేసి కవర్‌ చేశారని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Updated On 12 Oct 2023 2:38 AM GMT
Ehatv

Ehatv

Next Story