అగ్రశ్రేణి కథానాయిక సమంత(samantha) క్రేజ్ ఎల్లలు దాటింది. హాలీవుడ్(Hollywood) కూడా సమంత కాల్షీట్ల కోసం ఎదురుచూస్తోంది. ఈ మధ్య విడుదలైన సినిమాలు ఆశించినంతగా విజయం సాధించకపోయినా సమంత కెరీర్ మునుపటి కంటే వేగంగా దూసుకుపోతున్నది. గత దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా హిరోయిన్‌గా మారారు.
అగ్రశ్రేణి కథానాయిక సమంత(samantha) క్రేజ్ ఎల్లలు దాటింది. హాలీవుడ్(Hollywood) కూడా సమంత కాల్షీట్ల కోసం ఎదురుచూస్తోంది. ఈ మధ్య విడుదలైన సినిమాలు ఆశించినంతగా విజయం సాధించకపోయినా సమంత కెరీర్ మునుపటి కంటే వేగంగా దూసుకుపోతున్నది. గత దశాబ్ద కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్-2(The Family Man 2) వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా హిరోయిన్‌గా మారారు. వరుస సినిమాలతో ఆమె బిజీగా ఉంటున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి ఆమె ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. నాగ చైతన్యతో(Naga Chaithanya) విడిపోవడం, ఆ తర్వాత మయోసైటిస్(Myositis) అనే వ్యాధి సోకడం ఆమెను బాగా కుంగదీశాయి.. అయినప్పటికీ ఎంతో ధైర్యంగా వాటిని ఎదుర్కొని నలుగురికి ఆదర్శంగా నిలిచారు. మయోసైటీస్ బారిన పడిన సమయంలో సమంత సినిమాల్లో నటించడం కష్టమని అనుకున్నారు. సినిమాలకు స్వస్తి చెబుతున్నారనే వదంతులు కూడా వచ్చాయి. కానీ సమంత మాత్ర ఎంతో ధైర్యంగా వ్యాధిని జయించారు. కాళ్లు కూడా కదపలేని స్థితి నుంచి కళ్లు చెదిరే స్టెప్పులేసే స్థాయికి వచ్చారు. అయితే మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత సమంత ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. జీవితంలో కష్టనష్టాలను ఎలా ఎదుర్కోవాలో, ఒడిదుడుకులను ఎలా తట్టుకోవాలో తెలుసుకున్నారు. వాటిని సోషల్ మీడియా(Social Media)లో ఫ్యాన్స్‌కు చెబుతున్నారు. ఓ రకంగా వ్యక్తిత్వ వికాసం పాఠాలు నేర్పుతున్నారు. మోటివేషనల్ కోట్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. అలాగే ఆమె పెట్టే కొన్ని పోస్టులు కొత్త ఆలోచనలకు దారి తీస్తాయి. లేటెస్ట్‌గా సమంత పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. చావు నుంచి మనల్ని ఏదీ కాపాడలేనప్పుడు , కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి అని చిలీ దేశానికి చెందిన ప్రముఖ రచయిత పాబ్లో నెరుడా(Pablo Neruda)
చెప్పిన మాటలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సమంత ఎందుకీ సూక్తిని షేర్ చేసి ఉంటారనే దానిపై నెటిజన్లు భిన్న రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇంతకు ముందు సమంత ప్రేమలో పడిందన్న వార్తలు వచ్చాయి. ఈ టైమ్‌లో సమంత ఇలాంటి కోట్స్ షేర్ చేయడంతో అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగానే సమంత ప్రేమలో పడ్డారా? సమంత మనసుదోచుకున్నది ఎవరు? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.