2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమా ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాతోనే ఒక లవ్ స్టోరీ మొదలైంది. అదే నాగ చైతన్య సమంతలది. అలా మొదలైన వాళ్ల ప్రేమ ‘మనం’ సినిమాతో బలపడింది. ఇక తర్వాత ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది.  2017లో ఎంగేజ్ మెంట్.. ఆ తర్వాత పెళ్లి, నాలుగైదేళ్ల తర్వాత విడాకులతో ఆ బంధం ముగిసింది. వీళ్లిద్దరి విడాకుల తర్వాత జరిగిన కమెంట్స్  ఏంటో […]

2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ సినిమా ఎంత సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాతోనే ఒక లవ్ స్టోరీ మొదలైంది. అదే నాగ చైతన్య సమంతలది. అలా మొదలైన వాళ్ల ప్రేమ ‘మనం’ సినిమాతో బలపడింది. ఇక తర్వాత ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. 2017లో ఎంగేజ్ మెంట్.. ఆ తర్వాత పెళ్లి, నాలుగైదేళ్ల తర్వాత విడాకులతో ఆ బంధం ముగిసింది.

వీళ్లిద్దరి విడాకుల తర్వాత జరిగిన కమెంట్స్ ఏంటో అందరికీ తెలిసిందే. విడిపోవడం అయితే జరిగినప్పటికీ ఎందుకు విడిపోయారో మాత్రం క్లారిటీ లేదు. సమంత, చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ల బిహేవియర్ మాత్రం విచిత్రంగా ఉంది. చైతన్య అంటే విపరీతమైన కోపం ద్వేషం ఉన్నట్టు ఆమె చెప్పకనే చెప్తోంది. ఇదిలా ఉంటే చైతన్య మాత్రం ఆమె గురించి ఎక్కడ చూసినా పాజిటివ్ గానే చెప్తున్నట్టు కనిపిస్తోంది.

అయితే ‘ ఏ మాయ చేశావే’ చిత్రం రిలీజ్ అయి 13 ఏళ్లు అయిన సందర్భంగా సోషల్ మీడియాలో మీరిద్దరు కలిసి నటించే ఛాన్సెస్ ఉందా అనే ప్రశ్న వేశారు నెటిజన్లు.. అందుకు సమాధానంగా ‘అది జరిగితే నిజంగానే క్రేజీ’గా ఉంటుందని చెప్పాడట చైతు. ఇక చైతు గురించి సమంత దగ్గర ప్రశ్నిస్తే ఆమె వెంటనే సీరియస్ అయినట్టు తెలుస్తోంది.

ఆ మధ్య బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కరణ్ జోహార్ మాటల్లో మాటల్లో ‘నీ భర్త అని అంటే.. నా భర్త కాదు.. మాజీ భర్త’ అని కౌంటర్ ఇచ్చింది. అంతేకాదు మా ఇద్దరినీ ఒకే రూమ్ లో ఉంచితే.. దగ్గర్లో కత్తులు లేకుండా చూసుకుంటే బెటరని చెప్పుకొచ్చింది. అయితే పొడుచుకునేంత కోపాలు ఉన్నయా అనే అనుమానాలు కలిగిస్తోంది జెస్సీ చెప్పిన మాటలు. ఎంత ద్వేషం ఉన్నా కూడా.. ఇటు సినిమాను కెరీర్ ను, అటు పర్సనల్ లైఫ్ ను వేరు చేసి చూస్తుందని అనుకున్నారు.

కానీ ‘ ఏ మాయ చేశావే’ 13 ఇయర్స్ సెలబ్రేషన్స్ పోస్టర్ ను షేర్ చేయకుండా.. తన ఫొటోలు మాత్రమే ఉండేలా ఓ పోస్టర్ ను డిజైన్ చేసుకుంది ఆమె. ఎక్కడ చూడా నాగ చైతన్య ఫొటోలు కనిపించకుండా చాలా కేర్ తీసుకుంది శామ్. ఇదిలా ఉంటే చైతన్య మాత్రం సమంతతో కలిసి ఉన్న పోస్టర్ ను షేర్ చేశాడు. అయితే సమంత, చైతుకి ఉన్న తేడా అదే అని అంటున్నారు. మరో వైపు శామ్ కు చైతూ మీద ఎంత కోసం, ద్వేషం ఉందో దీనిబట్టి అర్ధమవుతుంది.

నాగ చైతన్య ఉన్న ఫొటోలను షేర్ చేసేందుకు ఆమెకు ఇష్టంలేనట్టు కనిపిస్తోంది. ఇంటర్నల్ గా ఏం జరిగిందో తెలియడం లేదుగానీ చైతన్య అంటే మాత్రం సమంతకు ఇంత కోపం ఉందాని అని ఇటు నెటిజనన్లు అటు జనాలు అనుకుంటున్నారు.

Updated On 27 Feb 2023 5:23 AM GMT
Ehatv

Ehatv

Next Story