స్టార్ హీరోయిన్ సమంత(samantha) మయోసైటిస్(Mayositis) వ్యాధితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే కదా! చికిత్స కోసం సినిమాకు కాసింత విరామం కూడా ప్రకటించారు. ట్రీట్‌మెంట్(Treatment) కోసం విదేశాలకు వెళుతున్నట్టు సమంత తెలిపారు. కాకపోతే అందుకు అయ్యే ఖర్చు కోసం టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరో దగ్గర 25 కోట్ల రూపాయలు అప్పు(Debt) చేసినట్టు వార్తలు వచ్చాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్తనే వైరల్ అవుతూ వస్తోంది. ఈ విషయంపై సమంత క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎంత మాత్రమూ నిజం లేదన్నారు. తన సమస్యను తానే పరిష్కరించుకోగలనని, వేరే వారి దగ్గర నుంచి ఆర్ధిక సాయం పొందాల్సిన అవసరం లేదని సమంత చెప్పారు.

'మయోసైటిస్ చికిత్స కోసం పాతిక కోట్ల రూపాయలా? ఇది కూడా తప్పే.. ఎవరో మీకు తప్పుడు సమాచారం అందించారు. మీరు చెప్పిన దానిలో అతి తక్కువ మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు నాకు రెమ్యూనిరేషన్‌గా రాళ్లురప్పలు ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. మయోసైటిస్ అన్నది ఓ సమస్య మాత్రమే. వేలాదిమంది ప్రజలు దీనితో బాధపడున్నారు.
ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించే ముందు దయచేసి కాస్త బాధ్యతగా వ్యవహరించండి' అని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి సమంత ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించారు. ఈమె పారితోషికం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సమంతకు అప్పు చేయాల్సిన అవసరం ఏముంటుంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక సమంతపై వదంతులు వస్తూనే ఉంటాయని, వాటిని నమ్మాల్సిన పని లేదని అభిమానులు అంటున్నారు. కొంత కాలంగా సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. యశోద సినిమా ప్రమోషన్‌లలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు. ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఆమె కొంతకాలం పాటు వర్క్‌లైఫ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. ఇటీవల సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఇండోనేషియాలోని(Indonesia) బాలి(Bali) టూర్‌కు వెళ్లారు. అక్కడ ఎంజాయ్ చేస్తూనే చికిత్స కూడా తీసుకుంటున్నారు.