అగ్రతార సమంత(Samantha), రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) జంటగా నటిస్తున్న సినిమా ఖుషి(Kushi Movie). ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియా(Social Media)లో సంచలనం సృష్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకుడు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ద్రాక్షారామ(Draksharamam) పరిసర ప్రాంతాలలో మొదలయ్యింది.

అగ్రతార సమంత(Samantha), రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) జంటగా నటిస్తున్న సినిమా ఖుషి(Kushi Movie). ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియా(Social Media)లో సంచలనం సృష్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకుడు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ద్రాక్షారామ(Draksharamam) పరిసర ప్రాంతాలలో మొదలయ్యింది. ఇందులో భాగంగా విజయ్‌, సమంతలపై క్లయిమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియో చూస్తే అక్కడ అందరూ ఒక యాగం చేస్తున్నట్టు ఉన్నారు. సమంత, విజయ్‌లు సంప్రదాయ దుస్తులలో కనిపిస్తున్నారు. మురళీశర్మ(Murali sharma), సచిన్‌ ఖేడేకర్‌(Sachin Khedekar) వంటి నటులు కూడా ఈ షూట్‌లో కనిపించారు. ఖుషిలోని కొన్ని సన్నివేశాలలో విజయ్‌- సమంత భార్య భర్తలుగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఖుషి సెట్స్‌ నుంచి సమంత సెల్ఫీ తీసుకుని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అందులో ఆమె మెడలో నల్లపూసలు కనిపించాయి. విజయ్‌ దేవరకొండ పోస్ట్ చేసిన వీడియోలో కూడా సమంత అదే చీరలో కనిపించారు. ఇప్పటికే విడుదలైన నా రోజా నువ్వే పాట యూ ట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది. వచ్చే వారం రెండో పాటలను విడుదల చేయనున్నారు. భిన్న నేపథ్యాలున్న ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ ఇది. ఈ సినిమాలో సమంత ముస్లిం యువతి పాత్ర చేస్తున్నారట! విజయ్‌-సమంతల కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం అంటోంది. సెప్టెంబర్‌ 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మరోవైపు సమంత ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు ఏడాది పాటు బ్రేక్‌ ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. సమంత కొన్ని రజులుగా మయోసైటిస్‌ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపైనే దృష్టి పెట్టాలని ఆమె అనుకున్నారు. గతంలో అంగీకరించిన కొన్ని సినిమాలకు సంబంధించిన అడ్వాన్సులను కూడా సమంత నిర్మాతలకు తిరిగి ఇచ్చేశారట.

Updated On 6 July 2023 12:23 AM GMT
Ehatv

Ehatv

Next Story