అగ్రతార సమంతది(Samantha) విశిష్టమైన వ్యక్తిత్వం. వ్యక్తిగత సమస్యలను, ఆపై వచ్చిన ఆరోగ్య సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ! సాధారణంగా ఎవరికైనా అరుదైన వ్యాధి వస్తే కుంగిపోతారు. మానసిక వేదనకు గురవుతారు. చికిత్స కోసం ప్రయత్నిస్తారు. కానీ సమంత మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఎందుకంటే తను మయోసైటిస్‌(Mayositis) అనే అరుదైన వ్యాధి బారిన పడిందన్న విషయం తెలియగానే అందరిలా ఆమె కూడా ఆవేదనకు గురయ్యారు.

అగ్రతార సమంతది(Samantha) విశిష్టమైన వ్యక్తిత్వం. వ్యక్తిగత సమస్యలను, ఆపై వచ్చిన ఆరోగ్య సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ! సాధారణంగా ఎవరికైనా అరుదైన వ్యాధి వస్తే కుంగిపోతారు. మానసిక వేదనకు గురవుతారు. చికిత్స కోసం ప్రయత్నిస్తారు. కానీ సమంత మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఎందుకంటే తను మయోసైటిస్‌(Mayositis) అనే అరుదైన వ్యాధి బారిన పడిందన్న విషయం తెలియగానే అందరిలా ఆమె కూడా ఆవేదనకు గురయ్యారు. కంటతడి పెట్టారు. కానీ ఏనాడూ కుంగిపోలేదు. డీలా పడలేదు. ఆత్మవిశ్వాసం పాలు ఎక్కువగా ఉన్న సమంత ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. ఇంతకు ముందు జీవితంలో తలిగిన అనేకానేక దెబ్బలను తట్టుకుని నిలబడింది. అందువల్ల మయోసైటిస్‌ వ్యాధికి ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు తాను కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేసింది.

ఇందులో సిటాడెల్‌(Citadel) అనే వెబ్‌ సిరస్‌ కూడా ఉంది. తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టడానికి ఏడాది పాటు నటనకు బ్రేక్‌ తీసుకోవాలని సమంత నిర్ణయించుకుంది. కొత్తగా అంగీకరించిన చిత్రాలకు తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ట్రీట్‌మెంట్‌ కోసం అమెరికాకు వెళుతుందనుకున్న సమంత.. నేరుగా అక్కడికి వెళ్లలేదు. అమెరికాకు వెళ్లడానికి ముందు ధ్యానం, యోగా, స్నేహితులతో డాన్సులు, ఆత్మీయులను కలవడాలు.. ఇలా తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడిపేస్తోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఆ వీడియోలను, ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తోంది. తాజాగా అందమైన స్విమ్మింగ్‌ పూల్‌, పూలతోటలు, బంగ్లాలో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) పోస్ట్‌ చేసింది. రాబోయేదంతా మంచి కాలమని నమ్మకంతో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజంగా సమంత అంటే సమంతనే! ఆమెకు ఆల్టర్‌నేట్‌ లేదు.

Updated On 8 Aug 2023 2:00 AM GMT
Ehatv

Ehatv

Next Story