గ చైతన్య(Naga Chaitanya) - సమంత(Samantha)లు విడాకులు తీసుకుని రెండేళ్లవుతోంది. ఇప్పటికీ వారెందుకు విడిపోయారన్నది మిస్టరీనే! ఎందుకు ఒకరినొకరు దూరమయ్యారన్న విషయంపై ఎవరెన్ని చెప్పినా, సమంత, నాగచైతన్య నోటి నుంచి వస్తే తప్ప దేన్ని నమ్మడానికి వీల్లేదు. ఇప్పటి వరకు విడాకులపై పల్లెత్తు మాట మాట్లాడని నాగచైతన్య తొలిసారిగా కారణాలేమిటో చెప్పుకొచ్చారు. సమంతతో గడిపిన రోజులను చాలా గౌరవిస్తానని, ఆమె చాలా లవ్లీ పర్సన్ అని తెగ మెచ్చుకున్నారు. సమంత ఎప్పటికీ సంతోషంగా ఉండాలని, అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
నాగ చైతన్య(Naga Chaitanya) - సమంత(Samantha)లు విడాకులు తీసుకుని రెండేళ్లవుతోంది. ఇప్పటికీ వారెందుకు విడిపోయారన్నది మిస్టరీనే! ఎందుకు ఒకరినొకరు దూరమయ్యారన్న విషయంపై ఎవరెన్ని చెప్పినా, సమంత, నాగచైతన్య నోటి నుంచి వస్తే తప్ప దేన్ని నమ్మడానికి వీల్లేదు. ఇప్పటి వరకు విడాకులపై పల్లెత్తు మాట మాట్లాడని నాగచైతన్య తొలిసారిగా కారణాలేమిటో చెప్పుకొచ్చారు. సమంతతో గడిపిన రోజులను చాలా గౌరవిస్తానని, ఆమె చాలా లవ్లీ పర్సన్ అని తెగ మెచ్చుకున్నారు. సమంత ఎప్పటికీ సంతోషంగా ఉండాలని, అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నాగచైతన్య అలా పోస్ట్ చేశారో లేదో ఆ కామెంట్లు వైరల్‌గా మారాయి. నెటిజన్లు కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. విడాకులు తీసుకుని విడిపోయినా ఒకరిపై ఒకరికి ఎంత గౌరవం ఉందో తెలుస్తున్నదని, ఇద్దరూ మళ్లి కలిస్తే బాగుటుందని కామెంట్ చేస్తున్నారు. నాగచైతన్య కామెంట్లు వైరల్ కావడమే ఆలస్యం సమంత కూడా ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టారు. మనమంతా ఒక్కటే. కేవలం అహంకారం, భయాలు మనల్ని దూరం చేస్తాయి అనే అర్థం వచ్చే ఓ కొటేషన్‌ను షేర్ చేశారు సమంత. నాగ చైతన్య కామెంట్ల తర్వాత సమంత ఇలా పోస్ట్ పెట్టడంతో విడాకులకు అసలు కారణం అహం అనే భావనకు వచ్చారు ఫ్యాన్స్. ఇద్దరూ ఈగోలకు వెళ్లి విడిపోయి ఉంటారని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలలో వచ్చిన వదంతుల కారణంగానే తమ మధ్య దూరం పెరిగిందని, అది పెరిగి పెరిగి విడాకుల వరకు వచ్చిందని ఓ సందర్భంలో నాగ చైతన్య అన్నారు. మొత్తంగా చూస్తే కేవలం అహం వీరిద్దరి మధ్య అగాధాన్ని సృష్టించిందని అర్థమవుతోంది.