తెలుగు సినిమా పరిశ్రమలోనూ జస్టిస్ హేమా కమిటీ(Hema Justice Committee) తరహాలో ఓ కమిటీ రావాలని అగ్ర కథానాయిక సమంత(Samantha) కోరారు.
తెలుగు సినిమా పరిశ్రమలోనూ జస్టిస్ హేమా కమిటీ(Hema Justice Committee) తరహాలో ఓ కమిటీ రావాలని అగ్ర కథానాయిక సమంత(Samantha) కోరారు. తెలుగు ఇండస్ట్రీలో మహిళల కోసం ఏర్పాటు చేసి 2019 సబ్ కమిటీ నివేదికను బయటపెట్టాలని కూడా సమంత అన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఈ విజ్ఞప్తులు చేశారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్లో(Instagram) మరో పోస్ట్ షేర్ చేశారు. అదిప్పుడు వైరల్ అవుతోంది. 'ఆగస్టు నెల గడిచిపోయింది. 2012లో జరిగిన హత్యాచార ఘటన తరహాలోనే ఇటీవల కోల్‌కతాలోనూ జరిగింది. ఘటనలు జరుగుతున్నాయి. వీటి గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. ఈ ఘటనల హైప్ మెల్లిగా తగ్గిపోతుంది. మనం కూడా మన పనులతో ముందుకెళ్తుంటాం. మళ్లీ ఘటన జరుగుతుంది’ అంటూ సమంత ఆ పోస్ట్‌లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. తాను గాయపడ్డ విషయాన్ని పరోక్షంగా చెప్పారు. 'గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాలేనా?' అంటూ సమంత పెట్టిన పోస్టు చూస్తే ఏదో సినిమా సెట్‌లో ఆమె గాయపడి ఉంటారని ఊహించవచ్చు.