స్టార్ హీరోయిన్ సమంత, దర్శక- నిర్మాత చిట్టిబాబు మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేట్టు లేదు. సమంత ఒకటంటే చిట్టిబాబు రెండంటున్నారు. మొన్నామధ్య శకుంతల ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంతపై చిట్టిబాబు కొన్ని కామెంట్స్ చేశారు. అవి వైరల్ కూడా అయ్యయి. సమంత కెరీర్ ముగిసిపోయిందని, ఆమె తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తోందని చిట్టిబాబు కామెంట్ చేశారు. యశోద సినిమా ప్రమోషన్స్ అప్పుడు ఇది వర్క్‌అవుటయ్యిందేమో కానీ అన్నిసార్లు ఇది కాదని చెప్పారు.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha), దర్శక- నిర్మాత చిట్టిబాబు (Chitti Babu) మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేట్టు లేదు. సమంత ఒకటంటే చిట్టిబాబు రెండంటున్నారు. మొన్నామధ్య శకుంతల ప్రమోషన్స్‌లో పాల్గొన్న సమంతపై చిట్టిబాబు కొన్ని కామెంట్స్ చేశారు. అవి వైరల్ కూడా అయ్యయి. సమంత కెరీర్ ముగిసిపోయిందని, ఆమె తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తోందని చిట్టిబాబు కామెంట్ చేశారు. యశోద సినిమా ప్రమోషన్స్ అప్పుడు ఇది వర్క్‌అవుటయ్యిందేమో కానీ అన్నిసార్లు ఇది కాదని చెప్పారు. పనిగట్టుకుని సినిమా ప్రమోషన్లు, ఇతర కార్యక్రమాల్లో ఆరోగ్యం బాగాలేదంటూ కన్నీళ్లు పెట్టుకోవడం చాలా దారుణం అంటూ చిట్టిబాబు చెప్పుకొచ్చారు.
చిట్టిబాబు చేసిన కామెంట్లకు సమంత స్పందించారు కానీ నేరుగా ఆయన పేరు చెప్పకుండా సెటైర్లు విసిరారు. చెవిలో వెంట్రుకల గురించి ఓ స్టోరీ పెట్టారు. వ్యక్తుల చెవుల నుంచి జుట్టు ఎలా పెరుగుతుందని గూగుల్ సెర్చ్ చేసి దాని స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశారు. టెస్టో స్టిరాన్ పెరగడమే మనుషుల చెవుల్లోంచి జట్టు పెరగడానికి కారణం అంటూ కామెంట్ చేశారు. చివరన ఇఫ్‌యు నో యు నో అనే క్యాప్షన్ కూడా రాశారు. ఇది చిట్టిబాబు గురించేనని పిల్లోడికి కూడా అర్థమయ్యింది.
ఇప్పుడు దీనిపై చిట్టిబాబు రియాక్టయ్యారు. తన మీద దాడి చేస్తే తాను తీవ్రంగా ప్రతిదాడి చేస్తానని హెచ్చరించారు. తన పేరు చెప్పలేదు కాబట్టి కోర్టుకు వెళ్లడం లేదని, లేకపోతే కోర్టులోనే తేల్చుకునేవాడినని చెప్పారు. ఇఫ్ యు నో.. యు నో అంటూ క్యాప్షన్ రాసుకొచ్చి తెలివితేటలు ప్రదర్శించానుకుంటుందేమో కానీ అదంతా మూర్ఖత్వమని అన్నారు చిట్టిబాబు. తన పేరు మెన్షన్ చేయలేదు కాబట్టే తాను సమంత పేరు మెన్షన్ చేయడం లేదని, లేకపోతే తాను ఇచ్చే సమాధానానికి సమంత మొహం ఎక్కడ పెట్టుకుంటుందోనని వ్యాఖ్యానించారు. తన వెంట్రుకల గురించి కాకుండా తాను అన్న మాటలకు సమాధానం ఇస్తే బాగుండేదనని అన్నారు. ఇప్పుడు చిట్టిబాబు కామెంట్లకు సమంత ఏమని అన్సర్ ఇస్తారో చూడాలి.