ఈమధ్య షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చి ఏడాది పాటు విశ్రాంతి తీసుకుంటుంది సమంత(Samantha). మయోసైటిస్(Myositis) తో బాధపడుతున్న ఆమె.. అటు ట్రీట్మెంట్(Treatment) తీసుకుంటూనే.. ఇటు తనకు నచ్చిన ప్రదేశాలకు తిరుగుతూ.. టూర్లు వేస్తోంది. జీవితంలో తనకు తగిలిన ఎదరు దెబ్బలను మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది బ్యూటీ. అంతే కాదు తన ఆరోగ్యం కోసం.. అటు ఆయుర్వేదంతో పాటు.. రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటుంది సమంత.

ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండే సామ్‌ కొంతకాలంగా ఎక్కువ సమయాన్ని వెకేషన్లకు(Vacations) ఇచ్చేసింది. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్.. ఇలా తనకు నచ్చిన ప్రదేశాలను చుట్టేసి వస్తోంది. ఇక తాజాగా ఆమె ఓ ఎత్తైన ప్రదేశంలో(Hill Area) ప్రత్యక్ష్యం అయ్యింది. ఓ ఎత్తెన కొండపై ఉన్న అరుగు మీద కూర్చుంది. పక్కనే మరో వ్యక్తి కూడా ఉన్నారు. ఇంతకీ ఈ బ్యూటీ ఎక్కడికెళ్లిందనే కదా మీ డౌటు. సామ్‌ పొరుగు దేశం భూటాన్‌కు స్నేహితులతో కలిసి టూర్ కు వెళ్ళింది.

అన్ని దేశాలు చూసి వస్తున్న సమంత.. తాజాగా బూటాన్(Bhutan) లో కనిపించింది. వేల అడుగుల ఎత్తైన కొండపై నుంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. సరదా సమయాన్ని గడిపింది. ఇంతకీ సామ్‌ పక్కనే మరో వ్యాక్తి కూడా ఉన్నారు. వారు ఎవరో కాదు...? డిజైనర్‌ క్రేషా బజాజ్‌.ఈ ఇద్దరితో కలిసి వెకేషన్‌లో ఉన్న ఇంకో వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం సిటడెల్‌ షూట్‌లో భాగంగా బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్‌ అండ్‌ టీంతో ఇంగ్లాండ్‌లో దిగిన స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. రాజ్‌-డీకే దర్శకత్వంలో సిటడెల్‌ ఇండియన్ వెర్షన్‌లో వరుణ్‌ధవన్‌, సమంత నటిస్తున్నారని తెలిసిందే.

Updated On 20 Nov 2023 8:21 AM GMT
Ehatv

Ehatv

Next Story