అగ్రశ్రేణి కథానాయిక సమంత(samantha) క్రేజ్ ఎల్లలు దాటింది. హాలీవుడ్(Hollywood) కూడా సమంత కాల్షీట్ల కోసం ఎదురుచూస్తోంది. ఈ మధ్య విడుదలైన సినిమాలు ఆశించినంతగా విజయం సాధించకపోయినా సమంత కెరీర్ మునుపటి కంటే వేగంగా దూసుకుపోతున్నది. వరుస సినిమాలతో ఆమె బిజీగా ఉంటున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి ఆమె ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. నాగ చైతన్యతో(Naga Chaithanya) విడిపోవడం, ఆ తర్వాత మయోసైటిస్(Myositis) అనే వ్యాధి సోకడం ఆమెను బాగా కుంగదీశాయి.
అగ్రశ్రేణి కథానాయిక సమంత(samantha) క్రేజ్ ఎల్లలు దాటింది. హాలీవుడ్(Hollywood) కూడా సమంత కాల్షీట్ల కోసం ఎదురుచూస్తోంది. ఈ మధ్య విడుదలైన సినిమాలు ఆశించినంతగా విజయం సాధించకపోయినా సమంత కెరీర్ మునుపటి కంటే వేగంగా దూసుకుపోతున్నది. వరుస సినిమాలతో ఆమె బిజీగా ఉంటున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్ట నష్టాల నుంచి ఆమె ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. నాగ చైతన్యతో(Naga Chaithanya) విడిపోవడం, ఆ తర్వాత మయోసైటిస్(Myositis) అనే వ్యాధి సోకడం ఆమెను బాగా కుంగదీశాయి.
అయినప్పటికీ ఏ దశలోనూ ఆమె ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. భయంకరమైన వ్యాధిని సైతం ధైర్యంగా ఎదుర్కొన్నారు. విజయం సాధించారు. ప్రస్తుతం సెర్బియాలో ఉన్న సమంత ఓ ప్రార్థనామందిరానికి వెళ్లి పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో(Instagram) షేర్ చేశారు. మయోసైటిస్(Mayositis) వచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకు తన జీవిత ప్రయాణం ఎలా సాగిందో వివరించారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అపజయాలపై తాను ఆత్మ పరిశీలన చేసుకున్నానని అన్నారు. పరిస్థితులు బాగుండేటట్టు చూడమని తాను భగవంతుడికి పూజలు చేశానని, ధైర్యాన్ని ఇవ్వమని కోరుకున్నానని సమంత చెప్పారు.
'మయోసైటిస్ వ్యాధిని నిర్ధారించిన తర్వాత మళ్లీ సాధారణ జీవితంలోకి అడుగుపెట్టి ఏడాది అవుతోంది. శారీరకంగా ఎన్నో పోరాటాలు చేశాను. ఆహారపు అలవాట్ల(Food habits) విషయంలో కూడా ఇష్టమైన వాటిని బలవంతంగా వదులుకున్నాను. మరి కొన్నింటిని కొత్తగా మొదలుపెట్టాను. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన పరాజయాల విషయంలోనూ ఆత్మ పరిశీలన చేసుకున్నాను. పరిస్థితులను మెరుపరచమని కోరుతూ భగవంతుడికి ఎన్నో ప్రార్థనలు చేశాను. విలువైన బహుమతులు, ఆశీస్సులు ఇవ్వమని దేవుడిని ఎప్పుడూ కోరలేదు.
కేవలం ధైర్యాన్ని, ప్రశాంతతను ఇవ్వమని మాత్రమే పూజలు చేశాను. అన్ని సమయాల్లో మనం అనుకున్న విధంగా అన్నీ జరగవని ఈ ఏడాది నాకు తెలియచేసింది. మరీ ముఖ్యంగా పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా ఫర్వాలేదని తెలుసుకున్నా. నేను నియంత్రించగలిగే అంశాలనే కంట్రోల్ చేయాలి. మిగిలిన వాటిని అలాగే వదిలేసి ముందుకు సాగిపోవాలి. కొన్ని సార్లు గొప్ప విజయాలు అవసరం లేదు. సంక్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడం కూడా విజయమే! పరిస్థితులు వాటంతట అవే మెరుగుపడతాయని, గతాన్ని తల్చుకుని దుఃఖిస్తూ అక్కడే కూర్చోకూడదు. నేను ఎవరినైతే ఇష్టపడతానో వారి ప్రేమలో ఉండాలనుకుంటున్నా.
నన్ను ఇబ్బందిపెట్టే అవకాశాలను ద్వేషించకూడదు. ఇక్కడ ఎంతో మంది పరిస్థితులలో పోరాటం చేస్తున్నారు. నేను అలాంటి వారి కోసం కూడా ప్రార్థనలు చేస్తాను. దేవుడు కాస్త ఆలస్యంగా మనకు ప్రేమ, శాంతి, ధైర్యం, ఆనందాన్ని అందించవచ్చు. ఆయనెప్పుడూ మనల్ని నిర్లక్ష్యం చేయరు' అని సమంత రాశారు. ఈ ఏడాది వచ్చిన శాకుంతలం సినిమా పరాజయం చవి చూసింది. ప్రస్తుతం తెలుగులో ఖుషిలో నటిస్తున్నారు సమంత. దీంతో పాటు బాలీవుడ్‌లో ఇండియన్ వెర్షన్ సిటాడెల్ చేస్తున్నారు. రాజ్ అండ్ డీకే నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సమంతకు జోడిగా వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా నటించిన సిటాడెల్ ప్రీక్వెల్‌గా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ సిరీస్ షూటింగ్ ప్రస్తుతం సెర్బియాలో జరుగుతుంది.