ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే వృధా! కోట్ల ఆస్తి ఉంటే ఏం లాభం ఇష్టమైన తిండి తినలేనప్పుడు... హీరోయిన్ సమంత(Samantha) విషయంలోనూ ఇదే జరుగుతోంది. సమంతకు మయోసైటిస్(Mayositisys) అనే అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా ఆమె నటనను తాత్కాలికంగా దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే వృధా! కోట్ల ఆస్తి ఉంటే ఏం లాభం ఇష్టమైన తిండి తినలేనప్పుడు... హీరోయిన్ సమంత(Samantha) విషయంలోనూ ఇదే జరుగుతోంది. సమంతకు మయోసైటిస్(Mayositisys) అనే అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా ఆమె నటనను తాత్కాలికంగా దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు. అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. అదలా ఉంచితే సమంత గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో(Social Media) రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాస్త కోలుకున్న సమంత ఆరోగ్యం మళ్లీ తిరగబెట్టిందనే ప్రచారం జరుగుతోంది. ఇది చూసి ఆమె శ్రేయోభిలాషులు, ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకుంటున్నారు. తన ఆరోగ్యం విషయంలో సమంత ఇటీవల డైట్‌ను పూర్తిగా మార్చుకున్నారట! డాక్టర్లు చెప్పింది పాటిస్తున్నారట! తనకు నచ్చిన ఆహారాన్ని కూడా దూరం పెట్టారట! బంగాళాదుంప, టమాటా, గుడ్లు, వేరుశనగకాయలు, పాలు వంటి వాటికి దూరంగా ఉంటున్నారు సమంత. బ్రెడ్, బట్టర్, జామ్ అంటే సమంతకు చాలా ఇష్టం. వాటికి కూడా సమంత ఇప్పుడు దూరంగా ఉండాల్సి వచ్చింది. చాలా రోజుల తరువాత ఇప్పుడు తనకు ఇష్టమైన బ్రెడ్, బట్టర్, జామ్‌ను ఆహారంగా తీసుకుంటున్నానని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఆమె ఆరోగ్యం కోలుకుంటున్నట్లే అని ఆమె ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.