అగ్రశ్రేణి కథానాయిక సమంత(samantha) ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలి(bali) పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే షూటింగ్స్‌ అన్ని పూర్తి చేసిన సమంత కొంతకాలం పాటు సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయం ఇంతకు ముందే ఆమె చెప్పారు. మయోసైటిస్‌(mayositis) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసమే ఈ విరామం తీసుకుంటున్నారని చెబుతున్నారు.

అగ్రశ్రేణి కథానాయిక సమంత(samantha) ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలి(bali) పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే షూటింగ్స్‌ అన్ని పూర్తి చేసిన సమంత కొంతకాలం పాటు సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. ఈ విషయం ఇంతకు ముందే ఆమె చెప్పారు. మయోసైటిస్‌(mayositis) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసమే ఈ విరామం తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయమై విదేశాలకు వెళ్లబోతున్న సమంత ట్రీట్‌మెంట్‌ కోసం భారీగానే ఖర్చు పెడుతున్నట్టు చెబుతున్నారు. తమిళనాడుకు చెందిన సమంత ఏ మాయ చేశావె(Em Maya Chesave) సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే సమంత అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌(NTR), మహేశ్‌బాబు(Maheshbabu), అల్లు అర్జున్‌(Allu Arjun) వంటి స్టార్‌ హీరోలతో కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌ అయ్యారు.

ఆ తర్వాత సమంత మళ్లీ వెనక్కి తిరిగిచూడలేదు. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించారు సమంత. తర్వాత ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చి హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ద ఫ్యామిలీ మ్యాన్‌(The Family Man) రెండో సీజన్‌లో అద్భుతంగా నటించారు. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రచేసిన సమంత పలువురి ప్రశంసలు అందుకుననారు. త్వరలో సిటాడెల్‌(Citadel) వెబ్‌ సిరీస్‌తో అందరినీ ఎంటర్‌టైన్‌ చేయబోతున్నారు. అలాగే ఆమె విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్‌ 1వ తేదీన విడుదల కాబోతున్నది. మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో తను బాధపడుతున్నట్టు లాస్టియర్‌ వెల్లడించారు సమంత. ఒకవైపు సినిమాలు చేస్తూనే చికిత్స తీసుకున్నారు. అయితే పూర్తి మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం అమెరికా వెళ్లబోతున్నారని, ఇందుకోసం పాతిక కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనున్నారని అంటున్నారు. ఇది నిజమే కావచ్చు కానీ, ఈ మొత్తాన్ని ఓ హీరో దగ్గర అప్పుగా తీసుకున్నారనే ఓ వదంతి మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే చాలా సంపాదించిన సమంతకు అప్పు చేయాల్సిన అవసరం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంటే సమంత అప్పు చేస్తున్నారన్న దాంట్లో మాత్రంనిజం లేదని తెలుస్తోంది. అది కచ్చితంగా ఫేక్‌ న్యూసే!

Updated On 2 Aug 2023 12:05 AM GMT
Ehatv

Ehatv

Next Story